Moviesఆ హీరోకు ఇష్టంలేకుండా బ‌ల‌వంతంగా పెళ్లి చేసిన సీనియ‌ర్ ఎన్టీఆర్‌... షాకింగ్...

ఆ హీరోకు ఇష్టంలేకుండా బ‌ల‌వంతంగా పెళ్లి చేసిన సీనియ‌ర్ ఎన్టీఆర్‌… షాకింగ్ ట్విస్ట్‌..!

టాలీవుడ్ నటరత్న సీనియర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లో సినిమాల్లో తిరిగిలేని స్టార్ హీరోగా ఎలా ఎదిగారో.. రాజకీయాల్లోకి వచ్చి అంతే సంచలనం క్రియేట్ చేశారు. ఎన్టీఆర్‌కు మొత్తం నలుగురు కుమార్తెలు, ఏడుగురు కుమారులు. 11 మంది సంతానం ఉన్నారు. ఎన్టీఆర్ సినివారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చారు. అలాగే మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్ గా ఉంటే.. జ‌య‌కృష్ణ డిస్ట్రిబ్యూటర్ గా కూడా పనిచేశారు. ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంతోమంది పెళ్లిళ్లకు పెద్దగా వ్యవహరించారు.. మధ్యవర్తిగా వ్యవహరించారు.

అయితే ఓ హీరో పెళ్లి ఆయన బలవంతంగా చేశారని ఆ హీరోకు అది ఇష్టం లేని పెళ్లి అయిందని.. ఎన్టీఆర్ బలవంతంతో ఆ హీరో పెళ్లి జరిగిన అది ఎక్కువ కాలం నిలవలేదు అని ప్రచారం ఉంది. ఆ హీరో ఎవరో కాదు దివంగత సీనియర్ నిర్మాత వడ్డే రమేష్ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ వడ్డే నవీన్. ‘ కోరుకున్న ప్రియుడు ‘ సినిమాతో హీరో అయిన వడ్డే నవీన్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ‘ పెళ్లి ‘ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించాడు. ప్రస్తుతం నవీన్ ఫెడౌట్ అయిపోయాడు. తన వ్యాపారంలో బిజీగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.

నవీన్ ఎన్టీఆర్ మనవరాలు అయిన విజయ చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. అయితే నవీన్.. విజయ చాముండేశ్వరిని పెళ్లి చేసుకోవటానికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడని.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని ప్రచారం ఉంది. ఎన్టీఆర్.. నవీన్ కు హీరోగా మంచి లైఫ్ ఇద్దామని తన మనవరాలి భర్తను చేస్తే తమ వైపు నుంచి కూడా సపోర్ట్‌ ఉంటుందని స్వయంగా ఈ సంబంధం నవీన్ తండ్రి వడ్డే రమేష్ తో మాట్లాడి కుదిరిచ్చారు. ఎన్టీఆర్ స్వయంగా తన మనవరాలని ఇస్తానని అనడంతో నవీన్ తండ్రి రమేష్ కూడా కాదనలేకపోయారు.

అయితే ఈ పెళ్లి జరిగిన కొన్నేళ్లకే ఇద్దరి మధ్య అనుకొన్నంత సఖ్యత లేదు.. మనస్పర్ధలు పెరిగి పెద్దవి కావడంతో పెళ్లయిన కొద్ది రోజులకే వీరు విడిపోయారు. ఆ తర్వాత వడ్డే నవీన్ విజయవాడకే చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నవీన్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలా ఎన్టీఆర్ కుటుంబానికి అల్లుడు అయిన వడ్డే నవీన్.. ఆ బంధాన్ని ఎక్కువకాలం కొనసాగించలేకపోయాడు. ఒకవేళ నవీన్ ఆ బంధాన్ని అలా నిలుపుకొని ఉంటే.. టాలీవుడ్ లో కొన్నాళ్లపాటు మంచి స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగే వాడిని ఇండస్ట్రీ జనాలు అంటూ ఉంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news