భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈ విషయాన్ని వీరిద్దరూ ఎప్పుడు అధికారంగా ప్రకటించలేదు. అయితే సానియా ఇన్ డైరెక్టుగా ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించింది. ఆమె సోషల్ మీడియా పోస్టుతో దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఇది ఇలా ఉంటే షోయబ్ మాలిక్ తాజాగా మరో పెళ్లి చేసుకున్నాడు టీవీ నటిని షోయబ్ పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఫోటోలు పోస్ట్ చేసి పెళ్లి విషయాన్ని చెప్పేశాడు. ఈ పెళ్లితో సోనియా – షోయబ్ విడాకులు తీసుకున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. 2010లో అనూహ్య పరిస్థితుల మధ్య సానియా – షోయబ్ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఒక హైదరాబాద్ యువకుడితో సానియాకు చాలా గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ జరిగింది. సానియా దానిని రద్దు చేసుకుని మరీ ఈ పాక్ క్రికెటర్ ను పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఈ పెళ్లిపై పెద్ద విమర్శలు వచ్చాయి.
అప్పటికే షోయబ్ మాలిక్ కు ఒక పెళ్లయింది. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సానియాను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత సానియా – షోయబ్ కాపురం చాన్నాళ్లపాటు సాగింది. ఈ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.. తర్వాత వీరి విడాకులపై రూమర్లు మొదలయ్యాయి. దుబాయ్ వేదికగా వీరిద్దరూ చాలాసార్లు జంటగా కనిపించారు. ఎట్టకేలకు విడిపోయారన్న రూమర్లు నిజమయ్యాయి. వీరు విడాకులు తీసుకున్నట్టుగా తేలిపోయింది.
వీరిద్దరు సోషల్ మీడియా బయోగ్రఫీలో తమ దాంపత్యం గురించి ఇంతకుముందు రాసుకున్న వ్యాఖ్యలను మార్చేసుకున్నారు. తనయుడు కోసం మధ్య మధ్యలో కాస్త కలిసి కనిపించారు. ఇప్పుడు షోయబ్ మాలికి పెళ్లితో వీరిద్దరు విడిపోయిన విషయం పై క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి ఇది షోయబ్‌కు మూడో పెళ్లి కాగా.. సానియాకు ఒక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కాగా.. షోయబ్‌తో మొదటి పెళ్లి.. ఇక ఆమె కూడా మరో పెళ్లికి రెడీ అయ్యే ఛాన్సులున్నాయి.