మాస్ మహరాజా రవితేజ పట్టుబట్టి పంతం నెగ్గించుకున్నాడు. రవితేజ గతేడాది నటించిన రావణాసుర, చివర్లో దసరాకు టైగర్ నాగేశ్వరరావు రెండు డిజాస్టర్లు అయ్యాయి. మళ్లీ సంక్రాంతికి ఈగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. సంక్రాంతి రేసులో నాలుగు సినిమాలు ఉండడంతో ఫిల్మ్ చాంబర్ పెద్దలు ఒత్తిడి చేయడంతో పాటు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఈగిల్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించి ఫిబ్రవరి 9కు వాయిదా వేశారు.
అప్పటికే ఫిబ్రవరి 8న ఏపీ సీఎం వైఎస్. జగన్ బయోపిక్ యాత్ర 2తో పాటు, 9న సందీప్ కిషన్ ఊరిపేరు భైరవకోన ఖర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. సందీప్‌కిషన్ లాంటి చిన్న హీరో సినిమా పోటీ ఉన్నా కూడా ఈగిల్ నిర్మాతలు తమకు సోలో రిలీజ్ కావాలని పట్టుబట్టారు. అక్కడితో ఆగలేదు. ఆ సినిమా నిర్మించిన ఫీపుల్స్ మీడియా వాళ్లు తమకు సోలో రిలీజ్ కోసం ఇచ్చిన మాటకు కట్టుబడాలని ఓపెన్ లేఖరాశారు.
చివరకు రవితేజ కూడా రంగంలోకి దిగి సోలో రిలీజ్ కోసం గట్టిగా పట్టుబట్టారట. నిజానికి సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా తగ్గిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1800కు పై చిలుకు స్క్రీన్లు యాత్ర, భైరవకోన, ఈగిల్‌కు కేటాయించినా ఇబ్బంది ఉండదు. అయితే థియేటర్లలో ఈగిల్ తప్పా ఏ సినిమా లేకపోతే ఈగిలే చూస్తారన్న ఆలోచనతో చివరకు ఈగిల్ హీరో, నిర్మాతలు ఏకమై ఒత్తిడి తేవడంతో సందీప్ కిషన్ సినిమాను వారం రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 16కు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది.
టాక్ ఏంటంటే ఈగిల్ సినిమా అనుకున్నంత గొప్పగా రాలేదంటున్నారు. అటు సందీప్ కిషన్ సినిమాకు ఇండస్ట్రీలో రిలీజ్ బిఫోర్ బజ్ బాగుంది. అందుకే రవితేజ రిస్క్ లేకుండా ఈగిల్‌కు సోలో రిలీజ్ కోసం పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. నిజానికి సినిమాలో దమ్ముంటే ఎన్ని సినిమాలు పోటీ ఉన్నా సంక్రాంతి రేసులో ఉన్న చిన్న సినిమా హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం.