ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలో ఆమె నటించిన తరువాత ఆమె పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయిపోయింది . మన రష్మికలో ఈ బోల్డ్ యాంగిల్ కూడా ఉందా..?? అంటూ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు . కాగా రీసెంట్గా యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు భారీ స్థాయిలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు .
యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరూ హాజరై సక్సెస్ సెలబ్రేషన్స్ ని బాగా సక్సెస్ చేశారు . సుమారు 890 కోట్లు కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ బాగా పాపులారిటి దక్కించుకుంది. కాగా యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇచ్చిన పార్టీలో రన్బీర్ కపూర్ రష్మిక మందన్నాల బిహేవియర్ అందరికీ చాలా విచిత్రంగా అనిపించింది .
ఈ పార్టీలో రన్బీర్ కపూర్ రష్మిక అందరూ చూస్తుండగానే రెచ్చిపోయి గట్టిగా హగ్ చేసుకోవడం.. అదేవిధంగా ముద్దులు పెట్టుకోవడం తో అక్కడుండే జనాలకు మరింత ఆశ్చర్యకరంగా అనిపించింది . అంతేకాదు వాళ్ళిద్దరూ హగ్ చేసుకోగానే అక్కడ ఉండే వారంతా గట్టిగా అరిచారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . దీంతో వీరిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా ..? అన్న విధంగా కూడా బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది..!!
Geetanjali Aka #RashmikaMandanna
— Suresh PRO (@SureshPRO_) January 7, 2024
At #Animal success bash🥳🖤pic.twitter.com/gd3XXo4LIL