గుంటూరు కారం.. ఏ ముహూర్తాన స్టార్ట్ అయిందో తెలియదు కానీ అప్పటినుంచి అన్ని అవాంతరాలు అవరోధాలే. ఫైనల్లీ రిలీజ్ అయింది కదా హిట్ కొట్టింది కదా అనుకునే లోపే సినిమా బొమ్మ ఫ్లాప్ అంటూ టాక్ బయటకు వచ్చేసింది . మహేష్ కెరియర్ లో ఎన్నో సినిమాలు మొదట ఫ్లాప్ టాక్ దక్కించుకుని..మళ్ళీ హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్ గానే మిగిలిపోయింది .
కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము దులిపేసింది . ఈ సినిమాల్లో మదర్ – సన్ సెంటిమెంట్ బాగా చూపించాడు త్రివిక్రమ్ . కాగా ఈ సినిమాలో మహేష్ బాబుకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుంది . నిజానికి ఈ పాత్ర కోసం పవర్ఫుల్ యాక్టర్ రవీనా టండనాను అనుకున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఈ సినిమాలో ఆమెను నటింపజేయాలి అని బాగా డిసైడ్ అయ్యారట .
కానీ రవీనాటండనా ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. రిజన్ ఏంటో తెలియదు కానీ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం నదియా ని కూడా అప్రోచ్ అయ్యారట. ఆమె కూడా రిజెక్ట్ చేయడంతో ఈ పాత్రను రమ్యకృష్ణ వద్దకు తీసుకువెళ్లారు. ఈ సినిమా ను రమ్యకృష్ణ ఓకే చేసింది. అలా ఇద్దరు రిజెక్ట్ చేసిన పాత్రలో ఫైనల్లీ రమ్యకృష్ణ సెట్ అయింది..!!