గణతంత్ర దినోత్సవం ..సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును ప్రకటించింది . పలు సామాజిక సేవ ..ప్రజా వ్యవహారాలు.. సైన్స్.. కళలు ..ఇంజనీరింగ్ ..వాణిజయం.. పరిశ్రమలు.. వైద్యం.. క్రీడా పౌర సేవలు.. మొదలైన రంగాలలో విశేష సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను ఇస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే .
కాగా 2024 కి గాను మొత్తంగా 132 మంది పురస్కారాలు అందుకోవడానికి ఎంపికయ్యారు. వీళ్ళ పేర్లను అఫీషియల్ గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వీళ్లల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించింది . ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం . దీంతో మెగా ఫాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు . ఆయన చేసిన సేవలకు ఈ అవార్డు కచ్చితంగా రావాల్సిందే అని మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసలతో ముంచేత్తుతున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల అందరూ హ్యాపీగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరో మాత్రం కుళ్ళుకొని చచ్చిపోతున్నాడు అంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవికి సరి సమానంగా పోటీ ఇచ్చే ఆ హీరోకి పద్మ విభూషణ్ లాంటి అవార్డ్స్ ఏది రాకపోవడం గమనార్హం. దీంతో తాను ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునే ఆ హీరో పరోక్షకంగా ఇండస్ట్రీలో జీరో అయిపోయాడు . నాకు పెద్ద బాధ్యతలు వద్దు అని చెప్పుకునే చిరంజీవి తెలియకుండానే ఇండస్ట్రీ పెద్ద అయిపోయాడు . దీంతో ఆ హీరో కుళ్లుకొని చచ్చిపోతున్నాడట . అన్ని అవార్డులు చిరంజీవికే వస్తాయా..? అంటూ బాధపడిపోతున్నాడట..!!