ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బుల్లితెరపై విడాకులు తీసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువైపోతున్నారు. తాజాగా అదే బాటలో ఒక యూట్యూబర్ జంట విడాకులు తీసుకుంటుంది . వారిది ఫార్మ్స్ అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు . ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండ్లు పండించి డోర్ డెలివరీ చేస్తున్న నేత్ర – మోటివేటర్ వంశీ జంట విడాకులు తీసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే ఇదంతా ఫేక్ అంటూ చాలామంది జనాలు కొట్టి పడేశారు. వాళ్ళది చాలా అన్యోన్యమైన జంట అని .. వాళ్ళు అలా చేయరు అంటూ చెప్పుకొచ్చారు, కానీ చివరికి సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలే నిజమయ్యాయి . నేత్ర – వంశి విడాకులు తీసుకుంటున్నట్లు వాళ్ళ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్లు పెట్టుకోవచ్చారు .
“డియర్ ఫ్రెండ్స్.. మేమిద్దరం రెండు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత ఇప్పుడు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం.. మేము మా వ్యక్తిగత జీవితాల గురించి గౌరవించి ఇద్దరం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం .. మమ్మల్ని సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు చాలా థాంక్స్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు . ఈ పోస్ట్ చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు. ఎందుకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు విడిపోతున్నారు .. ఈమధ్య ఇది ఒక కొత్త ట్రెండ్ అయిపోయింది అంటూ ఫైర్ అవుతున్నారు”.