అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి గౌరవ మర్యాదలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున తనదైన స్టైల్ లో నటించి ఎన్నో సినిమాల్లో మెప్పించాడు . అక్కినేని నాగార్జున కెరియర్ పరంగా దూసుకుపోయే టైంలో ఆయన లక్ష్మీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని నాగచైతన్యకు తండ్రి అయ్యాక విడాకులు తీసేసుకున్నాడు.
ఈ విషయం అప్పట్లో పెద్ద హర్ట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . దగ్గుబాటి లక్ష్మి వెంకటేష్ సిస్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే దగ్గుబాటి ఆడపడుచును చీట్ చేసిన తర్వాత నాగార్జున అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకి అఖిల్ పుట్టాడు. వీళ్ళిద్దరి కొడుకులు కూడా వైవాహిక జీవితంలో సక్సెస్ కాలేకపోయారు . ఒకరు పెళ్లి తర్వాత విడాకులు తీసుకుంటే మరొకరు నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు .
అయితే వీళ్ళ పెళ్లి గురించి నాగార్జున ఆలోచించకపోవడం గమనార్హం . మిగతా స్టార్ హీరోల కొడుకులు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఒక్కొక్కరు ఇద్దరు బిడ్డలను కన్నేసి ఎంజాయ్ చేస్తున్నారు . అయితే నాగచైతన్య అఖిల్ మాత్రం ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు . దీంతో కావాలనే కొందరు అక్కినేని ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు. అయితే నాగార్జున పిల్లలకి ఇష్టం లేకుండా ఏ పని చేయడని ..పెళ్లి విషయంలో పూర్తి నిర్ణయం కొడుకులకే ఇచ్చేసాడని ..అందుకే వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాము అంటే అప్పుడే సంబంధాలు వెతుకుతామని వెయిట్ చేస్తున్నాడట..!!