టాలీవుడ్‌లో గత రెండు, మూడేళ్లలో జంటల మధ్య జరిగిన విడాకులు ఎంత సెన్షేషన్ అయ్యాయో చూస్తూనే ఉన్నాం. సమంత – చైతు, నిహారిక కొణిదెల – జొన్నలగడ్డ చైతన్య విడాకులు ఎవ్వరూ ఊహించనే లేదు. నిహారిక – చైతు అయితే పెళ్లయ్యాక యేడాదికే దూరంగా ఉన్నారు. మరో నాలుగైదు నెలలకే విడాకులు తీసుకున్నారు. మొత్తం మీద పెళ్లయ్యాక సంవత్సరంన్నర కూడా లేకుండానే వీరు విడిపోయారు. వీరిద్దరి వెడ్డింగ్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఇక విడాకుల తర్వాత నిహారిక మళ్లీ తనకు ఇష్టమైన గ్లామర్ ఫీల్డ్‌లోకి దిగిపోయింది.
ఇటు వెబ్‌సీరస్‌లలో నటిస్తూనే నిర్మాతగాను మారింది. హీరోయిన్‌గా తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే తన పెళ్లి బంధం అనేది కేవలం యేడాదిలోనే ముగిసిపోతుందని తాను ఏ మాత్రం అనుకోలేదని కూడా తెలిపింది. పెళ్లి మిగిల్చిన బాధ వల్ల ఎవ్వరిని అంత సులువుగా నమ్మకూడదన్న విషయం తనకు అర్థమైందని వాపోయింది.
ఇక విడాకులతోనే జీవితం ముగిసిపోయినట్టు కాదని.. ఎదుట వ్యక్తులను ఈజీగా నమ్మకూడదన్న విషయంతనకు పెళ్లి తర్వాతే అర్థమైందని.. ఇదో పాఠంగా తీసుకుని తాను ముందుకు వెళ్లడం అలవాటు చేసుకున్నానని చెప్పుకువచ్చింది. ఇప్పటకీ పెళ్లి తర్వాత జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుకు వస్తే తనకు కన్నీళ్లు ఆగవని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక పెళ్లయ్యాక యేడాదిన్నరకే విడాకులు తీసుకోవడంపై తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించింది. అంత ఖర్చు పెట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం ఎందుకంటూ చాలా మంది విమర్శించారు.. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైందని.. ఎప్పటకి కలిసి ఉంటామనే ఉద్దేశంతోనే అంత భారీగా ఖర్చు చేసి ఏ జంట అయినా పెళ్లి చేసుకుంటారని.. సంవత్సరంలో విడాకులు తీసుకుంటామని ముందుగా తెలిస్తే ఎవ్వరూ అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోరు కదా అని తన అభిప్రాయం బయట పెట్టింది.
ఇక పెళ్లి తర్వాత తన జీవితంలో ఏదీ ఊహించినట్టుగా జరగలేదని.. అందుకే ఆ బంధాన్ని త్వరగానే ముగించేశానని, తన సభ్యులు, స్నేహితులు తన గురించి ఏమనుకుంటారో అదే తనకు ముఖ్యం అని.. తనతో సంబంధం లేని వారు తన గురించి ఏమనుకున్నా తాను అస్సలు పట్టించుకోనని నిహారిక తెలిపింది. గత రెండేళ్లలో ఫ్యామిలీ విలువలు బాగా అర్థం చేసుకున్నాను.. తనను భారంగా తన కుటుంబ సభ్యులు ఎప్పుడూ భావించలేదని తెలిపింది. ఏదేమైనా నిహారిక మాటలు వింటుంటే పెళ్లి తర్వాత ఆమె చాలా ఇబ్బందులకు గురైనట్టు, ఎంతో బాధపడినట్టు ఆమె వైపు వెర్షన్‌లో అర్థమవుతోంది.