Moviesతన రికార్డులను తానే బద్ధలు కొట్టుకున్న మహేశ్ బాబు.. రమణ గాడి...

తన రికార్డులను తానే బద్ధలు కొట్టుకున్న మహేశ్ బాబు.. రమణ గాడి దెబ్బ మామూలుగా లేదురోయ్..!!

గుంటూరు కారం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు నటించిన సినిమా. మీనాక్షి చౌదరి.. శ్రీ లీల హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్న సరే కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మి పడేస్తున్నాడు. మహేష్ బాబు కేవలం తెలుగులోనే 175 కోట్లకు పైగా వసూలు రాబట్టిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకోబోతున్నట్లు ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

ఇలా మహేష్ బాబు 200 కోట్ల గ్రాస్ అందుకొని 100 కోట్ల షేర్ ని రాబడిన సినిమాలు ఏకంగా ఐదు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా కూడా 100 కోట్ల షేర్ ని అందుకుంది. ఈ సినిమా 225 కోట్ల గ్రాస్ వచ్చింది . అంటే దాదాపు 110 కోట్ల షేర్ వచ్చినట్లు. ఆ తర్వాత వచ్చిన మహర్షి , సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా 100 కోట్ల షేర్ ని అందుకున్నాయి .

2022లో వచ్చిన సర్కారి వారి పాట సినిమా 230 కోట్ల గ్రాస్ ని రాబట్టి మహేష్ బాబు కెరియర్ లోనే సంచలన రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు అదే పరంపరని గుంటూరు కారం కొనసాగిస్తుంది కేవలం ఒక్క భాషలో రిలీజ్ అయినప్పటికీ ఈ విధంగా కలెక్షన్స్ కుమ్మి పడేయడం మన మహేష్ బాబుకి చెందింది . దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news