టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి.. రిలీజ్ అయ్యే సరికే మూడేళ్లు పట్టేలా ఉంది. ఇదిలా ఉంటే మహేష్‌బాబు ఇప్పటి వరకు పౌరాణిక పాత్రలు చేయలేదు. భవిష్యత్తులో మహేష్ ఒక్కసారి అయినా పౌరాణిక పాత్రల్లో నటిస్తే చూడాలనుకునే సినీ జనాలు ఎంతో మంది ఉన్నారు.
అయితే టాలీవుడ్ సర్కిల్స్‌లో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ చర్చకు వస్తోంది. సంక్రాంతికి వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సీక్వెల్స్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు కూడా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా స్క్రిఫ్ట్ కూడా ప్రశాంత్ వర్మ ఎప్పుడో రెడీ చేసి ఉంచాడు. ఇందులో రాముడి పాత్ర ఉంటుందట. అయితే ఈ పాత్ర నిడివి మూడు, నాలుగు సీన్లకే పరిమితం అవుతుందట.
ఈ పాత్ర కోసం మహేష్‌బాబును తీసుకుంటే శ్రీరాముడిగా మహేష్ పక్కగా సెట్ కావడంతో పాటు సినిమాకు మరింతగా హైప్ వస్తుందని అంటున్నారు. మహేష్ మరో మూడేళ్లపాటు ఎలాగూ వెండితెర మీద కనపడడు. జై హనుమాన్‌లో రాముడిగా కనిపిస్తే ఇటు మహేష్‌ను వెండితెర మీద చూసేందుకు మరో మూడేళ్లు ఆగాల్సిన అవసరం ఉండదు. పైగా రాముడిగా మహేష్ చక్కగా సూట్ అవుతాడు.
హనుమాన్ హిట్ అయ్యాక వస్తోన్న సీక్వెల్ కావడంతో ప్రాజెక్టుకు మంచి బజ్ కూడా వస్తుంది. అయితే జై హనుమాన్ మేకర్స్ ఆలోచన ఎలా ఉందో .. ఇటు మహేష్ మధ్యలో మరో ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి రాజమౌళి ఒప్పుకుంటాడా ? అన్నది చూడాలి. కానీ రాముడిగా మహేష్ వేస్తే ఖచ్చితంగా సెన్షేషనల్ అవుతుందనడంలో సందేహం లేదు.