టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత 13 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఎన్నో అంచనాలతో ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా తొలి ఆటతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఫస్ట్ వీక్ ముగిసే సరికే రు. 210 కోట్ల రేంజ్ గ్రాస్ వసూళ్లు రాబట్టిందంటూ నిర్మాతలు పోస్టర్లు వేసుకుంటున్నా ఈ సినిమా కలెక్షన్లపై చాలా సందేహాలు ఉన్నాయి. సంక్రాంతి సెలవుల హడావిడి ముగియడంతో గుంటూరు కారంను చాలా థియేటర్లలో తీసేసి హనుమాన్ సినిమా వేస్తున్నారు. గుంటూరు కారం థియేట్రికల్ రన్ ముగిసేలాగానే కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అనుకున్న దానికంటే చాలా ముందుగానే గుంటూరు కారం ఓటీటీలోకి రానుంది. నెల రోజుల్లోపలే అంటే వచ్చే నెల ఫిబ్రవరి 9నే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా సినిమా హిట్టు.. సూపర్ హిట్టు అని ఎంత చెప్పుకుంటున్నా సినిమాకు కలెక్షన్లు లేకపోవడంతోనే ఇంత త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారన్నది నిజం.