జాన్వి కపూర్ .. ఈ పేరు గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఆల్రెడీ శ్రీదేవి కూతురిగా బాగా పాపులారిటీ దక్కించేసుకునింది . తనదైన స్టైల్ లో ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసేసి నిద్రలేని రాత్రులను గిఫ్ట్‌గా ఇచ్చి ఆమె స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకుంది . బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది . ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. కాగా టాలీవుడ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో డెబ్యూ ఇవ్వబోతుంది .
ఈ సినిమాతో ఫస్ట్ విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది జాన్వి కపూర్ . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాన్వి కపూర్ దేవర సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది . “దేవర సినిమా షూట్ చూశాక దేవర సెట్స్ లో పాల్గొన్నాక నేను అంతకుముందు నటించిన సినిమాలు అన్నీ నాకు ఆఫ్ట్రాల్ అనిపిస్తున్నాయి. అదంతా వర్క్ షాప్స్ అని ..నా అసలు సిసలైన కెరియర్ స్టార్ట్ అయ్యేది దేవర సినిమాతో అనే అని నాకు నమ్మకం ఉంది “.
“ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది . అంతేకాదు నా కెరియర్ లోనే నాకు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. తారక్ తో స్క్రీన్ షేరింగ్ అమెజింగ్.. చాలా చాలా బాగుంది. మీతో పాటు నేను కూడా ఈ సినిమా ఎప్పుడు ధియేటర్స్ లో చూస్తానా..?? అంటూ వెయిట్ చేస్తున్నాను” అంటూ జాన్వి కపూర్ ఓ రేంజ్ లో హైప్ పెంచేశారు. దీంతో సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!