వర్ష .. ఈ పేరు చెప్తే హీరోయిన్ కి మించిపోయిన రేంజ్ లో అరుపులు కేకులు వినపడతాయి . చూడడానికి కత్తిలాంటి ఫిగర్ అయినా సరే ఇండస్ట్రీలో మాత్రం హీరోయిన్ అంత స్ధానం దక్కించుకోలేకపోయింది . బుల్లితెరకు ఓకే కాని వెండితెరకి టు ఓవర్ అనే కామెంట్లు కూడా వినిపించాయి . జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వర్షా ఇమ్మానియేల్ తో కలిసి చేసిన స్కిట్స్ ఎంత బాగా హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిందే .
అసలు ఒకానొక టైం లో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది . వీళ్ళు వేసే స్కిట్స్ కూడా అలాగే ఉన్నాయి. అందుకే వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వార్త నిజమే అంటూ కూడా జనాలని అమ్మేశారు . అయితే అదంతా అబద్ధమని కేవలం స్కిట్స్ కోసమే వాళ్ళు అలా చేస్తున్నారు అని.. పలుసార్లు జబర్దస్త్ కమెడియన్స్ ఓపెన్ అప్పయ్యారు .
రీసెంట్గా ఇమ్మానియేల్ ను వర్ష అన్నా అని పిలవడం అభిమానులకు షాక్ ఇచ్చింది . స్కిట్లో భాగంగా వర్ష వేరే కమెడియన్ ను పెళ్లి చేసుకుంటుంది . అంతేకాదు ఇమ్మానుయేల్ ని అన్నా అంటూ పిలుస్తుంది . దీంతో ఇమ్మానుయేల్ కి బాగా కోపం వస్తుంది . చూడు వర్ష ఏదైనా పిలువు అన్నా అని మాత్రం పిలవద్దు అంటూ అందరి ముందే స్ట్రైట్ గా కూసింత గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ పూర్తి ఎపిసోడ్ జనవరి 12వ తేదీ ప్రసారం కాబోతుంది . దీంతో సోషల్ మీడియాలో వర్ష చేసిన మోసం అభిమానులను బాధపడుతుంది. ఇదంతా స్కిట్ రా బాబు అంటున్న కూడా కొంతమంది పర్సనల్గా తీసుకొని వర్షను ట్రోల్ చేస్తున్నారు..!!