సినిమా ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడుగా పాపులారిటీ సంపాదించుకున్న ఇళయరాజా కుమార్తె గాయని భవతారిణి మరణించింది . చిత్ర పరిశ్రమ ఈ విషాద వార్త విని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. చాలా చిన్న ఏజ్ లోనే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం అభిమానులకు బాధాకరంగా అనిపిస్తుంది. తన టాలెంట్ తో ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా అంటే అందరికీ చాలా ఇష్టం గౌరవం .
ఆయన కూతురు కూడా భవతారణి అలాగే క్రేజ్ సంపాదించుకుంది . రీసెంట్గా ఆమె అనారోగ్య కారణంగా మరణించింది. ఆమె కాలయ క్యాన్సర్ కు చికిత్స పొందేందుకు శ్రీలంక వెళ్లినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . గత కొంతకాలంగా ఆమె ఈ క్యాన్సర్ బారిన పడి బాగా ఇబ్బందులు పడుతుందట. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన కూడా ఆమె ప్రాణాలను నిలబెట్ట లేకపోయారు .
ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఆమె నిన్న సాయంత్రం ఐదు గంటలకు శ్రీలంకలోనే మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు నేడు ఆమె అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు . భవతారణి ‘భారతి’లోని ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు సాధించారు. ఆరోగ్యం పట్ల ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేసే భవతారని ఇలా ఇలా క్యాన్సర్ కి గురవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కష్ట సమయంలో దేవుడు ఇళయరాజాకు తోడుగా నిలవాలని కోరుకుంటున్నారు. అయితే కొంతమంది ఆమె కు వేరే జబ్బు కూడా ఉందని..ఆ కారణంగానే ఇంత సడెన్ గా మరణించిందని చెప్పుకొస్తున్నారు..!!