ప్రభాస్ .. చాలా సైలెంట్ గా ఉంటాడు . తన పని తాను చూసుకొని వెళ్ళిపోతాడు . సినిమా సెట్స్ లో ఉండే అందరికీ కడుపు నింపుతాడు . కులం – మతం తేడా లేకుండా అందరితోనూ భాగం అవుతాడు అందరికీ ఇంతవరకే తెలుసు . కానీ మన ప్రభాస్ లో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉందని అమ్మాయిలను ఇంప్రెస్ చేయడంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు అని ఈ మధ్యనే బయటపడింది . రీసెంట్గా ప్రభాస్ సలార్ హిట్ తర్వాత తన ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసుకున్నారు .
దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ షేర్ చేసుకున్నది తన సినిమా గురించో.. లేకపోతే తన పర్సనల్ విషయం గురించో.. అయితే ఇంత వైరల్ అయ్యేది కాదు. ఒక హీరోయిన్ గురించి కావడంతో ఈ న్యూస్ పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ హీరోయిన్ దీపికా పదుకొనేకు తనదైన స్టైల్ లో రొమాంటిక్ విషెస్ అందించాడు . జనవరి ఐదు దీపిక బర్త డే . ఈ క్రమంలోనే ఆమెకు విషెస్ అందిస్తూ ..”ది మోస్ట్ బ్యూటిఫుల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ తనదైన స్టైల్ లో విష్ చేశాడు .
దీంతో ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . ఇంత రొమాంటిక్గా ప్రభాస్ ఎప్పుడు ఎవరికీ విష్ చేసింది లేదు . కేవలం దీపికా పదుకొనేకే ఎందుకు అలా విష్ చేశాడు..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే కల్కి సినిమాలో ఆమె నటిస్తుందని ఆ సినిమా హైప్ కోసమే ఇలా ప్రభాస్ చేత ఎవరైనా మెసేజ్ పెట్టి ఉండొచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు రెబల్ ఫ్యాన్స్ . మొత్తానికి డార్లింగ్ చేసిన ఒక్క మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాని గజగజ వణికించేస్తుంది..!!