టాలీవుడ్లో స్టార్ హీరోలు, ఇతర నటులు యంగ్ అమ్మాయిలతో పడక సుఖం కోసం చాలా సీక్రెట్‌గా ప్లాన్లు చేస్తూ ఉంటారన్న టాక్ తెలిసిందే. ఇప్పుడున్న చాలా మంది స్టార్ హీరోలు కూడా ఆ సుఖం కోసం చాలా సీక్రెట్‌గా అమ్మయిలను రప్పించుకుంటూ ఉంటారు. ఇందుకోసమే కొందరు స్టార్ హీరోలు సీక్రెట్‌గా బెంగళూరు, ముంబై కూడా వెళ్లి వస్తుంటారు. ఒక టాప్ హీరో అయితే ఏకంగా దుబాయ్ వెళ్లి మరీ అమ్మాయిలతో ఎంజాయ్ చేసి వస్తుంటాడన్న గుసగుసలు ఉన్నాయి.
ఇక తాజాగా టాలీవుడ్ నటీనటులకు అమ్మాయిలను సప్లై చేసే రాకెట్ గుట్టు ఒకటి రట్టయ్యింది. అబీడ్స్ సెక్స్ రాకెట్లో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు అఖిల్ పహిల్వాన్‌ను పోలీసులు విచారిస్తోన్న క్రమంలోనే చాలా సీక్రెట్లు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. రాంనగర్‌కు చెందిన అఖిల్ తన స్నేహితుడు అఖిల్‌తో కలిసి అబీడ్స్‌లోని ఫార్చ్యూన్ హోటల్లో సీక్రెట్‌గా సెక్స్ రాకెట్ నడిపిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు జరిపిన దాడుల్లో ఏకంగా 16 మంది అమ్మాయిలు దొరికిపోయారు. వీరిలో ఎక్కువ మంది బెంగాల్ అమ్మాయిలు, ఆ తర్వాత ముంబై యువతులు ఉన్నట్టు సమాచారం.
అఖిల్ పహిల్వాన్ ఫోన్లో టాలీవుడ్‌కు చెందిన పలువురు వెండితెర హీరోలతో పాటు బుల్లితెర నటుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నట్టు తేలింది. అఖిల్ టాలీవుడ్లో పలువురు టాప్ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులకు కూడా అమ్మాయిలను సరఫరా చేస్తూ ఉండేవాడని కూడా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పూర్తి విచారణ జరిపితేనే అసలు వాస్తవాలు అన్నీ వెల్లడి కానున్నాయి. ఇక పశ్చిమబెంగాల్‌తో పాటు ముంబై మోడల్స్, నార్త్ ఇండియాకు చెందిన కుర్ర అమ్మాయిలను టాలీవుడ్ నటులకు సరఫరా చేసేవాడన్న చర్చ నడుస్తోంది. అఖిల్ ఫోన్లో కూడా పైన చెప్పుకున్న అమ్మాయిల ఫోన్ నెంబర్లే ఉన్నాయంటున్నారు.
ఇక టాలీవుడ్లో గతం నుంచే కొందరు స్టార్ హీరోలు యంగ్ అమ్మాయిలతో ఆ సుఖం ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ కాకుండా కొన్ని సీక్రెట్ ప్లేస్‌లు ఎంచుకుని అక్కడకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారన్న గుసగుస ఉంది. కొందరు హీరోలు బెంగళూరుకు, మరికొందరుకు ముంబైకు వెళుతుంటే.. కొందరు శ్రీలంకకు వెళతారట. ఓ స్టార్ హీరో అయితే దుబాయ్‌కు విహార యాత్రకు వెళ్లినట్టు వెళ్లి అక్కడ ఆ సుఖం బాగా ఎంజాయ్ చేసి వస్తాడట.
ఈ సుఖం పొందేందుకు టాలీవుడ్ నటులు కొందరు బ్రోకర్లను కూడా ఆశ్రయిస్తూ ఉంటారట. అయితే తమ మేనేజర్లతో పాటు కొందరు మీడియేటర్ల సాయంతో తమ పేర్లు బయటకు రాకుండా చాలా పగడ్బందీగా వీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొందరు అగ్ర నిర్మాతలు కూడా శ్రీలంకకు చెక్కేసి.. ఇక్కడ నుంచే అక్కడకు అమ్మాయిలను రప్పించుకుని ఎంజాయ్ చేస్తోన్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్లో రసిక మహారాజులకు లెక్కేలేదు.