కొందరు ఇండస్ట్రీలో ఉండే హీరోలు రొమాంటిక్ సీన్స్ లో అవలీలగా నటించేస్తారు . అసలు సిగ్గు – మొహమాటం – బిడియం అనేది లేకుండా.. ఎలాంటి డీప్ రొమాన్స్ అయినా చేస్తూ ఉంటారు . మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కూడా చాలామంది అలా చేశారు . అయితే ఎన్టీఆర్ మాత్రం రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడు.. ఎందుకంటే రొమాంటిక్ సీన్స్ లో అలా నటించడం నటించడం ఇష్టం ఉండదు.
అయితే గతంలో ఓ సినిమాలో ఎన్టీఆర్ ఒక హీరోయిన్ తో లిప్ కిస్ సీన్ లో నటించాల్సి ఉంటుంది. కానీ ఆ సీన్ చెప్పగానే ఎన్టీఆర్ డైరెక్టర్ పై కోప్పడి పారిపోయారట. నేను ఇలాంటి సీన్ చెయ్యను అంటూ చేతులెత్తేసాడట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు రాజమౌళి . రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . వీళ్ళ కాంబోలో వచ్చిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా సింహాద్రి .
ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన భూమికతో ఒక లిప్ కిస్ సీన్ ప్లాన్ చేశారట రాజమౌళి . అయితే ఆ సీన్ నేను చేయను అంటూ ఎన్టీఆర్ షూట్ నుంచి పారిపోయారట. అప్పట్లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయింది . అప్పుడే కాదు ఇప్పుడు కూడా రొమాంటిక్ సీన్స్ లో ఎన్టీఆర్ నటించను అంటూ తెగేసి చెప్పేస్తున్నాడట. ప్రసెంట్ ఇదె న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతుంది..!!