టాలీవుడ్ యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రభాస్ కెరీర్ లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సినిమాలలో మిస్టర్ పర్‌ఫెక్ట్ కూడా ఒకటి. కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తెలుగులో స్టార్ హీరోల పక్కన తాప్సీ చేసిన సినిమాల్లో మంచి హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు సంతోషం సినిమా తీసి ఇండస్ట్రీలో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దశరథ్ దర్శకత్వం వహించారు.
వాస్తవానికి మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా డైరెక్టర్ చేయాల్సిన దర్శకుడు వివి వినాయక్. ఆది, చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్, బధ్రీనాథ్ లాంటి యాక్షన్ సినిమాలు తీసిన వినాయక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. పైగా దిల్ రాజు మొదటి సినిమా దిల్‌కు వినాయక్ దర్శకుడు. అంతకు ముందే ప్రభాస్ – వినాయక్ కాంబినేషన్లో వచ్చిన యోగి సినిమా డిజాస్టర్. అందుకే మరోసారి ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వినాయక్‌కు ఇవ్వాలనే దిల్ రాజు తన బ్యానర్లో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సినిమాకు ఆ ఛాన్స్ ఇచ్చారు.
కథ మొత్తం విన్నాక వినాయక్ దిల్ రాజుకు ఓ సలహా ఇచ్చారు. కథ బాలా బాగుంది.. ప్రభాస్‌కు బాగా సూటవుతుంది.. తాను డైరెక్ట్ చేస్తే కథ ప్లేవర్ అంతా మారిపోతుంది.. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ అవుతాయి.. కథలో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కావాల్సినంత సబ్జెక్ట్ ఉంది… ఈ కథను ఫ్యామిలీ సినిమాలను డైరెక్ట్ చేసే దర్శకుడికి అప్పగిస్తే బాగుంటుందని సూచనలు చేశారట.
వెంటనే దిల్ రాజు దశరథ్‌ను పిలిచి కథ చెప్పగా.. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు. ముందుగా ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. రకుల్ – ప్రభాస్ మీద కొంత షూటింగ్ కూడా జరిగింది. కానీ ప్రభాస్ పక్కన ఆమె అంతగా సూట్ కాలేదని.. ఆమెను మార్చేసి అప్పటికే డార్లింగ్ సినిమాతో మంచి హిట్ ఫెయిర్‌గా పేరున్న కాజల్‌ను తీసుకున్నారు. చివరకు ఆ సినిమా హిట్ అయ్యింది. అలా వినాయక్ జడ్జ్‌మెంట్ కరెక్టుగా సెట్ అయ్యిందని దిల్ రాజు చాలా సందర్భాల్లో చెప్పారు.