టాలీవుడ్‌లో త్రివిక్రమ్‌కు ఇగో, పంతం, పట్టింపులు బాగా ఎక్కువుగా ఉంటాయన్న చర్చ ఉంది. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద బ్యానర్ అయినా గురూజీ అంటూ ఆయన్నో ఆకాశంలో ఉన్న దేవుడిగా కీర్తించాలి.. గౌరవించాలి.. ఎంత పెద్దోళ్లు అయినా ఆయన ఆహాన్ని సంతృప్తి పరచకపోతే వారిని పక్కన పెట్టేస్తూ తాను ఆకాశం నుంచి దిగివచ్చిన దేవుడు మాదిరిగా ఆయన వ్యవహరిస్తారన్న ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది. అసలు అజ్ఞాతవాసి సినిమాకు ముందు త్రివిక్రమ్ చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు, స్టార్లను కూడా పూచిక పుల్లలా చూసేవారన్న గుసగుసలు కూడా గట్టిగానే ఉన్నాయి.
ఆ సినిమా ఫలితం దెబ్బతో కాస్త దిగి వచ్చిన త్రివిక్రమ్‌కు ఎంతోమంది స్టార్లు కూడా ఛాన్సులు ఇచ్చచేందుకు భయపడినా ఎన్టీఆర్ పిలిచి మరీ అరవింద సమేత సినిమా చేశాడు. సినిమా హిట్.. తర్వాత అల వైకుంఠపురంలో బ్లాక్‌బస్టర్.. ఆ తర్వాత మళ్లీ త్రివిక్రమ్ ఆకాశంలోకి వెళ్లిపోయాడు. అసలు ఈ నాలుగేళ్లలో తన సినిమాల మీద కాన్‌సంట్రేషన్ చేయకుండా.. పవన్ సినిమాలు సెట్ చేయడంలోనూ.. పవన్ సినిమాలకు పని చేయడంతోనే కాలక్షేపం చేస్తూ.. భారీగా డబ్బులు వెనకేసుకున్నాడనే అంటున్నారు.
కట్ చేస్తే మహేష్‌బాబు మూడోసారి ఇచ్చిన ఛాన్సును కూడా త్రివిక్రమ్ కాలదన్నుకున్నాడు. ఇప్పుడు గుంటూరు కారం త్రివిక్రమ్‌ను మరోసారి నేలమీదకు దించేసింది. పుష్ప 2 పాన్ ఇండియా హిట్ అయితే బన్నీ కూడా త్రివిక్రమ్‌ను దగ్గరకు రానిస్తాడా అంటే సందేహమే. ఇదంతా ఇలా ఉంటే టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా భారీ కాంబినేషన్లతో సినిమాలు తీస్తూ సూపర్ హిట్లు కొడుతూ దూసుకుపోతోంది.
గత సంక్రాంతికి ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోలు చిరు, బాలయ్యతో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండు సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టింది.
నైజాం డిస్ట్రిబ్యూషన్‌లో కింగ్‌గా దూసుకుపోతోంది. తాజాగా హనుమాన్ సినిమా కూడా నైజాంలో ఆ సంస్థే పంపిణీ చేసింది. గతంలో మైత్రీ వాళ్లు త్రివిక్రమ్‌తో తమ బ్యానర్లో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారు. త్రివిక్రమ్ ఆ సినిమా ఊసే పట్టించుకోలేదట. ఆ తర్వాత మైత్రీ వాళ్లు పంచాయితీ పెట్టడంతో వడ్డీలతో కలిపి త్రివిక్రమ్ దానిని సెటిల్ చేసినట్టు టాక్ ? ఇది త్రివిక్రమ్ ఆహాన్ని దెబ్బతీసిందని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది.
తాజాగా వరుస విజయాలతో జోష్ మీదున్న మైత్రీ వాళ్లు త్రివిక్రమ్‌ను తమ బ్యానర్లో ఓ సినిమా చేయాలని అడిగారట. త్రివిక్రమ్ ఫస్ట్ సిట్టింగ్‌లోనే నో చెప్పేశాడట. ప్రభాస్ మైత్రీ వాళ్లకు ఓ సినిమా చేయాలి. త్రివిక్రమ్‌ను తెచ్చుకుంటే వెంటనే ఆ సినిమా సెట్స్ ఎక్కిద్దాం అనడంతోనే మైత్రీ వాళ్లు త్రివిక్రమ్‌ను అప్రోచ్ అయ్యారని.. అయితే త్రివిక్రమ్ మాత్రం మైత్రీతో గతంలో మైత్రీ చెడడంతో ఫస్ట్ సిట్టింగ్‌లోనే నో చెప్పేశాడని చర్చ గట్టిగా నడుస్తోంది. ఏదేమైనా గురూజీకి ఎవరిమీద అయినా కోపం వస్తే ఇలాగే జరుగుతుందని టాలీవుడ్ భోగట్టా..!