ప్రెసెంట్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రజినీకాంత్ తాజాగా నటించిన సినిమా లాల్ సలాం . ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కాబోతుంది . తాజాగా భారీ ఎత్తున జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్ ఆయన భార్య లత కుమార్తె సౌందర్య, ఐశ్వర్య మనవళ్ళు పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే స్టేజి పైకి వచ్చిన ఐశ్వర్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు . “మా నాన్నగారు 35 ఏళ్లుగా వెండి తెర పై నటించి మంచి పేరు తెచ్చుకున్నారు . ఆ పేరుకు భంగం కలిగించే హక్కు ఏ కూతురికి ఉండదు . ఈ సినిమా కథ నచ్చడంతోనే ఆయన నటించడానికి అంగీకరించారు . నాకోసం ఈ చిత్రంలో ఆయన నటించలేదు . సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వార్తలు కామెంట్స్ నన్ను బాధించాయి “.
“ఒక స్టార్ కు అమ్మాయి అని గుర్తింపు ఉంటే చాలు ఇక్కడ ఎవరు సినిమా అవకాశం ఇవ్వరు . చిత్ర పరిశ్రమలో మీరు పెద్ద వ్యక్తి అయినప్పటికీ వారు మీకు సినిమా ఛాన్స్ ఇవ్వరు. కారణమేంటో నాకు తెలియదు . కొత్త వారికే ఛాన్సులు ఇస్తారు. దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమాకి పని చేస్తున్నప్పుడు నా పిల్లలతో ఎక్కువ సమయం గడపలేక పోయాను . వాళ్లు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు నా పిల్లలే నాకు గొప్ప అనుభూతి “అంటూ ఐశ్వర్య తెలిపింది…!!