Moviesమ‌హేష్ - చ‌ర‌ణ్ - బ‌న్నీ రికార్డుల బూజు దులిపేసిన '...

మ‌హేష్ – చ‌ర‌ణ్ – బ‌న్నీ రికార్డుల బూజు దులిపేసిన ‘ హ‌నుమాన్‌ ‘ .. దిమ్మ‌తిరిగి పోవాల్సిందే..!

సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోల సినిమాల మ‌ధ్య‌లో రిలీజ్ అయినా కూడా హ‌నుమాన్ ఆ మూడు సినిమాల‌ను మించి రికార్డు వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 150 కోట్ల వ‌సూళ్లు సాధించిన హ‌నుమాన్ ఓవ‌ర్సీస్‌లో టాప్ – 5లోకి దూసుకుపోయింది. ఓవ‌ర్సీస్‌లో హ‌నుమాన్ ప్ర‌భంజ‌నంతో బ‌న్నీ, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌బాబు రికార్డులు సైతం బ‌ద్ద‌ల‌య్యాయి.

యూఎస్‌లో ఆల్ టైం టాలీవుడ్ హిట్స్‌లో టాప్ – 5 ప్లేసులోకి హ‌నుమాన్ ఎగ‌బాకేసింది. జ‌స్ట్ 4 రోజుల క్రింద‌టే ఈ సినిమా టాప్ – 10 లిస్టులోకి చేరింది. అప్ప‌టికే హ‌నుమాన్ పీక్స్‌లో ఉండ‌డంతో ఈ సినిమా దెబ్బ‌కు ఆదిపురుష్ 3.1 మిలియ‌న్లు – సాహో 3.2 మిలియ‌న్లు – భ‌ర‌త్ అనే నేను 3.4 మిలియ‌న్ల రికార్డులు బ్రేక్ అయ్యాయి.

అయితే ఇప్పుడు హ‌నుమాన్ పై సినిమాల రికార్డులు బ్రేక్ చేయ‌డంతో పాటు మ‌రిన్ని రికార్డులు కూడా బీట‌వుట్ చేసేసింది. 3.7 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో టాప్ – 5లో చేరింది. ఈ క్ర‌మంలోనే అల వైకుంఠ‌పురంలో 3.6 మిలియ‌న్లు – రంగ‌స్థ‌లం 3.5 మిలియ‌న్ డాలర్ల రికార్డుల‌కు కూడా చెక్ పెట్టేసింది. ఇప్పుడు యూఎస్ మార్కెట్లో బాహుబ‌లి 1 త‌ర్వాత ప్లేస్ హ‌నుమాన్‌దే కావ‌డం విశేషం.

అమెరికాలో ఆల్ టైం టాప్ – 5 తెలుగు సినిమాలు :
1- బాహుబ‌లి 2 : 20.5 మిలియ‌న్ డాల‌ర్లు
2- ఆర్ ఆర్ ఆర్ : 14.3 మిలియ‌న్ డాల‌ర్లు
3- స‌లార్‌: 8.8 మిలియ‌న్ డాల‌ర్లు
4- బాహుబ‌లి 1 : 8 మిలియ‌న్ డాల‌ర్లు
5- హ‌నుమాన్‌: 3.7 మిలియ‌న్ డాల‌ర్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news