సినిమా ఇండస్ట్రీలో కోట్లాదిమంది జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రభాస్ పెళ్లి న్యూస్ వచ్చేసింది . సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆరడుగుల అందగాడు పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ అభిమానులతో పాటు స్టార్ సెలబ్రిటీస్ కూడా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్గా ప్రభాస్ పెళ్లి కి సంబంధించిన టాప్ సీక్రెట్ రెబెల్ ఫ్యామిలీ నుంచి లీక్ అయినట్టే వైరల్ గా మారింది.
ప్రభాస్ పెద్దమ్మ గారు గత సంవత్సరంలోనే ప్రభాస్ పెళ్లిపై హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాదికి ప్రభాస్ పెళ్లి అయిపోతుంది అని.. ఫ్యాన్స్ ని టెన్షన్ పడొద్దు అంటూ ధైర్యం చెప్పింది . కాగా సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ప్రభాస్ మార్చి 17వ తేదీ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు అని.. ఏప్రిల్ 21వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
రెబల్ ఫ్యామిలీ సన్నిహితుల దగ్గర నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ప్రభాస్ పెళ్లి వార్త కావడంతో ఈ న్యూస్ జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతుంది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది ఆ దేవుడి కే తెలియాలి. ఈ పెళ్లి వార్త నిజం అయితే బాగుండు అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?