అనసూయ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి వెండి తెర పై హంగామా సృష్టిస్తున్న అనసూయ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకుంది . కేవలం యాంకర్ గానే కాదు సినిమాలలో తన స్థాయికి తగ్గ రోల్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునింది . రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టేసిన అనసూయ పుష్ప2 సినిమాలో కూడా నటిస్తుంది .
పలు సినిమాలలో బిజీబిజీగా ఉంటున్న అనసూయ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది . తన కొడుకుల గురించి కంప్లైంట్ చేస్తూ అనసూయ పోస్ట్ పెట్టడం గమనార్హం . అనసూయ ఆ పోస్టులో రాసుకొస్తూ ..”నా కొడుకుల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. వాళ్లు చిన్నపిల్లలు కావడంతో వాషింగ్ మిషన్ కి వేసేటప్పుడు బట్టలు విడిచే ముందు వాళ్ళ పాకెట్స్ లో ఏముంటున్నయో చూసుకోవట్లేదు.”
” వాళ్ళ పాకెట్స్ లో ఉన్న వస్తువుల కారణంగా మా వాషింగ్ మిషన్ పాడైపోతుంది.. ఈ క్రమంలోనే ప్రతి రెండు నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించాల్సి వస్తుంది . నాకు ఇది చాలా చాలా తలనొప్పిగా మారిపోయింది . మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందా..?” అంటూ ఫ్యాన్స్ ని అడిగింది . దీంతో సోషల్ మీడియాలో అనసూయ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది..!!