Moviesచిరంజీవి నోరు విప్పాల్సిన టైం వచ్చిందా..? ఇండస్ట్రీలో ఇంత అన్యాయం జరుగుతూ...

చిరంజీవి నోరు విప్పాల్సిన టైం వచ్చిందా..? ఇండస్ట్రీలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నారా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి టఫ్ కాంపిటీషన్ నెలకున్నిందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా సంక్రాంతి సినిమాల విషయంలో ఈసారి పూర్తిగా భిన్న విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి . సంక్రాంతి కానుకగా ఎప్పుడు బాక్సాఫీస్ వద్ద బడా హీరోస్ కాంపిటీషన్స్ ఇచ్చుకుంటూనే ఉంటారు. కానీ ఈసారి ముగ్గురు బడా హీరోలకు ఒక చిన్న హీరో కాంపిటీషన్ ఇవ్వడం సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీ రిలీజ్ కాబోతుంది . అదేరోజు యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత జనవరి 13వ తేదీ వెంకటేష్ నటించిన సైంధవ్.. జనవరి 14వ తేదీ నాగార్జున నా స్వామి రంగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి . అయితే జనవరి 12వ తేదీ రిలీజ్ అయ్యే గుంటూరు కారం – హనుమాన్ సినిమాల విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

ముఖ్యంగా చిన్న సినిమా అయినా హనుమాన్ ని మధ్యలో నలిపేస్తున్నారు అని.. ఈ సినిమాకు అటు నైజాంలో ఇటు ఏపీలో థియేటర్స్ ఇవ్వకుండా ఘోరంగా దెబ్బతీస్తున్నారని .. సరైన బ్యాగ్రౌండ్ లేకపోతే ఇలాగే తొక్కేస్తారా ..??అంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు . అంతేకాదు గతంలో చిరంజీవి ఓసారి మాట్లాడుతూ..” సినీ పెద్దగా ఉండను కానీ అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాను ..నేనున్నాను అంటూ భుజం కాయాలనుకున్నప్పుడు బాధ్యత తీసుకోవడానికి రెడీ అంటూ చెప్పిన మాటలను ట్రోల్ చేస్తున్నారు జనాలు”. హనుమాన్ విషయంలో ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు విప్పవేమి చిరంజీవి ..??అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news