మెగాస్టార్ చిరంజీవి .. ఈ పేరు చెప్పగానే అందరికీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం ..వచ్చిన తర్వాత హీరోగా మారడం.. ఆ తర్వాత స్టార్ హీరోగా మారి తన పేరు చెప్పుకొని పదిమంది ఇండస్ట్రీలోకి వచ్చే అంత ఎత్తుకి ఎదగడం మామూలు విషయం కాదు . ఒకటి కాదు రెండు కాదు ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి.
అలాంటి హీరో ఒక సినిమాను వదులుకొని తప్పు చేశాను అంటూ ఇప్పటికీ బాధపడుతున్నాడట . ఆ సినిమా మరేదో కాదు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్మెన్ . అర్జున్ సర్జ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . సెన్సేషన్స్ క్రియేట్ చేసింది . నిజానికి ఈ కథను మొదటగా చిరంజీవి కోసమే అనుకున్నారట శంకర్ . ఆయనకు కథ కూడా వివరించారట .
అయితే కొన్ని కారణాల చేత ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అలా ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు చిరంజీవి. ప్రజెంట్ చిరంజీవి “విశ్వంభర” అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్ గానే ప్రకటించారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉండబోతున్నారట..!!