పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు శ్రీలీల లాంటి ఓ గొప్ప అందగత్తెను.. అందులోనూ తెలుగు అమ్మాయిని ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు నిజంగానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును మెచ్చుకోవాలి. ఆయన సెలక్షన్ సూపర్ అని చెప్పాలి. హీరోయిన్ల విషయంలో ఆయనకు ఎందుకు మంచి పేరు ఉందో శ్రీలీలను చూస్తేనే ఆయన టేస్ట్ ఎంత గొప్పదో తెలుస్తోంది. పెళ్లిసందడి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమాకు లాభాలు వచ్చాయంటే కేవలం శ్రీలీలే కారణమని డిస్ట్రిబ్యూటర్లు ఓపెన్‌గానే చెప్పేశారు.
ఆ తర్వాత ధమాకా, భగవంత్ కేసరి మూడు వరుస హిట్లు పడ్డాయి. తర్వాత నాలుగు ప్లాపులు పడినా కూడా శ్రీలీల సినిమాలో ఉందంటే ఆ సినిమా బిజినెస్ హాట్ కేకులా అమ్ముడవుతోంది. సంక్రాంతికి గుంటూరు కారం సినిమాలో మహేష్‌కు జోడీగా నటించిన శ్రీలీల.. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలోనూ పవన్‌కు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ల లిస్టులో శ్రీలీల ముందు వరుసలో ఉంటుంది.
భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల నటన విజ్జీపాపగా అదరగొట్టేసింది. తాజాగా ఆమె గులాబీ రంగు చీరలో చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఒక్క చీరకట్టుతో అందరి చూపులు తన వైపునకు తిప్పుకునే సత్తా తనకు ఉందని పూజా ఫ్రూవ్ చేసుకుంది. అసలు గులాబీ చీరలో శ్రీలీల అందాలు మామూలుగా లేవు. ఈ చీరట్టులో ఆమె అందమైన మాయలో మైమరిపిస్తోంది.