టాలీవుడ్‌లో ప్రస్తుతం రష్మిక, శ్రీలీల హవా నడుస్తోంది. రెండేళ్ల వరకు రష్మికకు అస్సలు తిరుగులేదు. ఆమె ఎంట్రీతో పూజా హెగ్డే దూకుడుకు బ్రేకులు పడ్డాయి. ఎప్పుడు అయితే శ్రీలీల ఎంటర్ అయ్యిందో రష్మిక దూకుడుకు కాస్త బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు శ్రీలీలకు కూడా వరుసగా నాలుగు నెలల్లో నాలుగు ప్లాపులు పడ్డాయి. ఆమెకు ఖచ్చితంగా ఓ హిట్ పడాలి. రష్మిక కూడా ఫామ్‌లోకి రావాలంటే పుష్ప 2 తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవ్వాలి.
ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోలతో పాటు మిడ్ రేంజ్ హీరోలు కూడా అయితే రష్మిక లేకపోతే శ్రీలీల వెంట పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు తమ సినిమాలో ఉంటే సినిమాకు క్రేజ్ రావడంతో పాటు మార్కెట్ పెరుగుతుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరు కూడా భారీ రెమ్యునరేషన్‌తో పాటు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఓకే చెపుతున్నారు.
తమకు రెమ్యునరేషన్ తక్కువైనా.. మిడ్ రేంజ్ హీరో అయినా వెనకా ముందు ఆడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు క్రేజీ హీరోయిన్లు యంగ్ హీరో నితిన్‌కు హ్యాండ్ ఇచ్చేశారట. మైత్రీ మూవీస్ – వెంకీ కుడుముల కాంబినేషన్లో నితిన్ హీరోగా తెరకెక్కే సినిమాలో ముందుగా రష్మికను హీరోయిన్‌గా అనుకున్నారు. ఆ తర్వాత ఆమెను తప్పించేసి ఆ ప్లేసులోకి శ్రీలీలను తీసుకున్నారు. అయితే ఇప్పుడు శ్రీలీల కూడా హ్యాండ్ ఇచ్చిందంటున్నారు.
ఇతర కారణాలేం లేకపోయినా ఈ ఇద్దరికి రెమ్యునరేషన్ గట్టిగానే ఉండాలి.. వీరి గొంతెమ్మ కోరికలు తీర్చాలి.. అటు హీరోలు కూడా పెద్ద హీరోలు, స్టార్ హీరోలే అయ్యి ఉండాలన్న డిమాండ్లే కనిపిస్తున్నాయట. దీంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం దర్శకుడు వెంకీ వేట మొదలు పెట్టాడట. రాబిన్‌హుడ్ అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలిస్తుండగా.. ఈ నెల 27 నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.