నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలకు సరి సమానంగా టఫ్ కాంపిటీషన్ ఇస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉంది . ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది .
అంతేకాదు ఈ సినిమాలో త్రిష – ప్రియమణి హీరోయిన్లుగా సెలెక్ట్ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇదే క్రమంలో సినిమాలో ఓ ఇంపార్టెంట్ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. కేజిఎఫ్ సినిమా ద్వారా మరోసారి తన సత్తాను చాటుకున్న సంజయ్ దత్- బాలయ్య సినిమాలో కనిపిస్తే ఆ లెవలే వేరు అంటున్నారు నందమూరి అభిమానులు . ఈ సినిమాలో సంజయ్ దత్ బాలయ్య మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఫైట్స్ కెవ్వు కేకలా ఉంటాయని ..థియేటర్స్ లో జనాలు సీట్లలో కూర్చోలేరని ..ఒక్క క్రేజీ న్యూస్ లీకై వైరల్ గా మారింది .
దీంతో సోషల్ మీడియాలో బాలయ్య – బాబీ సినిమాకి సంబంధించిన ఇదే న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సమరసింహా రెడ్డి కి మించిపోయే రేంజ్ లో ఉండబోతుందని..ఖచ్చితంగా ఆయన కెరీర్ లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతందని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్..!!