బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని ఫామ్ లో ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా బాలయ్యకు వరుసగా మూడో విజయాన్ని అందించింది. అఖండ – వీరసింహారెడ్డి తర్వాత గత ఏడాది దసరాకు వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతోపాటు 30 సంవత్సరాల తర్వాత బాలయ్యకు మూడు వరుస విజయాలు అందించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా.. శ్రీలీల కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు సూపర్ డూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
బాక్సాఫీస్ దగ్గర 140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన భగవంత్ కేసరి 100 రోజులు పూర్తి చేసుకుంది. భగవంత్ కేసరి డైరెక్టుగా 12 కేంద్రాలు.. షిఫ్టులతో కలిపి మరో 5 సెంటర్లు.. మొత్తం 17 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే ఇప్పుడు 100 రోజులు కూడా కంప్లీట్ చేసుకుంది. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమా అయినా 50 రోజులు ఆడితేనే గొప్ప.. అలాంటిది భగవంత్ కేసరి ఏకంగా 100 రోజులు ఆడడం.. అది కూడా ఒకే థియేటర్లో డైరెక్టుగా రోజూ 4 ఆటలతో సెంచరీ కొట్టింది.
చిలకలూరిపేటలో రామకృష్ణా థియేటర్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఇప్పట్లో ఏ హీరోకు లేని అరుదైన రికార్డు కూడా బాలయ్య సొంతం అయ్యింది. ఇదే చిలకలూరిపేట రామకృష్ణా థియేటర్లో బాలయ్య నటించిన చివరి మూడు హ్యాట్రిక్ విజయాలు సినిమాలు సెంచరీ కొట్టాయి. అఖండ 181 రోజులు – వీరసింహారెడ్డి 106 రోజులు.. ఇప్పుడు భగవంత్ కేసరి 100 రోజులు ఆడాయి.
చిలకలూరిపేట రామకృష్నా థియేటర్ అంటేనే నందమూరి సినిమాలకు అడ్డా.. ఈ థియేటర్లో బాలయ్య యావరేజ్, ప్లాప్ సినిమాలు కూడా 100 రోజులు ఆడాయి. కళ్యాణ్‌రామ్ పటాస్, బాలయ్య లయన్ సినిమాలు ఇక్కడే సెంచరీ కొట్టాయి. ఇప్పుడు బాలయ్య మూడు వరుస హిట్ సినిమాలు కూడా సెంచరీ కొట్టేశాయి. ఇదిలా ఉంటే వీరసింహారెడ్డి సినిమా కర్నూలు జిల్లా ఆలూరు శ్రీ లక్ష్మినరసింహా థియేటర్లో 365 రోజులు పూర్తి చేసుకుంది.