సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు హీరోయిన్స్ తప్పులు చేస్తూ ఉంటారు . తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ కొన్నిసార్లు మాత్రం వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ లైఫ్ ని బొక్క బోర్లా పడేలా చేస్తూ ఉంటాయి . అదే విషయం కారణంగా అనుష్క కూడా దెబ్బతింది . హీరోయిన్ అనుష్క టాలీవుడ్ జేజమ్మగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది .
అలాంటి అనుష్క బడా హీరోతో సినిమాలో నటించడానికి నో చెప్పింది . లుక్స్ పరంగా బాగోదు అంటూ రిజెక్ట్ చేసింది . ఆశ్చర్యమేంటంటే ఇప్పటివరకు ఆ కాంబో సెట్ అవ్వనే లేదు . ఆ కాంబో ఏంటా అనుకుంటున్నారా ..? అనుష్క – రామ్ చరణ్ . వీళ్ళిద్దరి కాంబోలో మొదటగా మగధీర సినిమా రావాల్సి ఉంది కానీ అనుష్క ఈ సినిమాలో నేను నటిస్తే చరణ్ కి అక్కలా ఉంటాను అంటూ రిజెక్ట్ చేసిందట .
ఆ తర్వాత గోవిందుడు అందరివాడే సినిమాలో కూడా కాజల్ పాత్రను మిస్ చేసుకుంది. అంతేకాదు ఎవడు సినిమాలో కూడా కాజల్ పాత్రను మిస్ చేసుకుంది . ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాల విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకొని అనుష్క సరిదిద్దుకోలేని తప్పు చేసింది. ఇకపై ఫ్యూచర్లో రాంచరణ్ తో నటిస్తాది అన్న ఆశలు కూడా లేవు..!!