Moviesఐశ్వర్యరాయ్‌ని దూరంగా చూస్తేనే ఆ అందం.. ద‌గ్గ‌రగా చూస్తే అస‌హ్యం: టాలీవుడ్...

ఐశ్వర్యరాయ్‌ని దూరంగా చూస్తేనే ఆ అందం.. ద‌గ్గ‌రగా చూస్తే అస‌హ్యం: టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌

ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్య రాయ్ గురించి ఎవరైనా ఎంతో గొప్పగా మాట్లాడుకుంటారు. ఆమె అందం గురించే పుస్తకాలు రాయొచ్చు..సినిమాలు తీయొచ్చు. ఐష్ కళ్ళ గురించి నవ్వు గురించి కవితలు రాయొచ్చు. ఇంత అందమైన సౌందర్యాన్ని దగ్గరగా చూడటానికి మాత్రం దర్శకుడు ఆర్జీవి ఇష్టపడడట. దీనికి కారణం కూడా చెప్పాడు ఆర్జీవీ.

ఐష్ ని దగ్గరగా చూస్తే ఆమె పెద్దగా నవ్వినప్పుడు గొంతులో టాన్సరస్ కనిపిస్తాయట. ఆమె అందం వెనక ఇంకేదైనా ఊహించుకోవచ్చు గానీ, ఇలా గొంతులో అసహ్యంగా కనిపించే టాన్సరస్ చూస్తే మాత్రం నాకు చాలా చికాగుగా అనిపించిందనీ ఆమె ఎంత అందంగా నవ్వుతుందో అది దూరం నుంచి చూస్తేనే బావుంటుంది..దగ్గరగా చూస్తే మాత్రం నాకు అసలు నచ్చదని చెప్పుకొచ్చాడు.

అలాగే, ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి ఎంతో అద్భుతమైన పాటలు రాశారు. పాటలో కొన్ని లైన్లు ఆయన తప ఇంకెవరూ రాయలేరు. కానీ, ఆయన నిర్మాతలను డబ్బులడగడం ఎవడూ ఊహించడు. పైగా ఆయన వాడే భాష కూడా విన్నవాడు వేటూరి మీద అభిప్రాయం మార్చుకుంటాడు. ఇంత గొప్ప రచయిత ఇలాంటి మాటలు మాట్లాడతారా..? మనిషిని మనం చూసే కోణంలో ఒక అభిప్రాయం ఉంటుంది.

ఒరిజినల్ గా వాళ్ళ ప్రవర్తన చూస్తే అసలు పొంతన ఉండదు. నా విషయమే తీసుకోండి..వీడు తీసే సినిమాలకి మాట్లాడే మాటలకి ప్రవర్తనకి సంబంధం ఉండదని మాట్లాడతారు. ఆర్జీవీ మీద ఒకప్పుడు మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది లేకపోవచ్చు అని తన గురించి కూడా ఓపెన్ గా చెప్పాడు వర్మ. అందాన్ని దూరం నుంచే చూసి ఎంజాయ్ చేయాలి. మరీ దగ్గరికి వెల్తే ఆ ఫీల్ ఉండదని అభిప్రాయపడ్డాడు ఆర్జీవి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news