టాలీవుడ్లో ఈ సంక్రాంతికి థియేటర్ల కోసం ఎంత రచ్చ జరిగిందో చూశాం. ఒకేసారి నాగ్, వెంకీ, మహేష్ సినిమాలతో పాటు చిన్న సినిమా హనుమాన్ కూడా రిలీజ్ అయ్యింది. హనుమాన్కు ఎవ్వరి బ్యాకప్ లేదు. దీంతో హనుమాన్ను సంక్రాంతి రేసు నుంచి తప్పించేందుకు ఇండస్ట్రీ పెద్దలు నానా రాజకీయాలు చేశారు. ఎలాంటి అండదండలు లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా ఈ రోజు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తూ రు. 300 కోట్ల వైపు పరుగులు పెడుతుందో చూస్తూనే ఉన్నాం.
సినిమా కంటెంట్‌లో దమ్ము ఉండాలే కాని.. ఏ సినిమాను ఎవ్వరూ తొక్కేంత సీన్ ఉండదు అని దమ్మున్న సినిమాగా హనుమాన్ ఫ్రూవ్ చేసుకుంది. గట్టిగా నెల రోజులు కూడా కాలేదు. ఇప్పుడు టాలీవుడ్లో మళ్లీ థియేటర్ల యుద్ధం మొదలైందని తెలుస్తోంది. ఈ సారి కుర్ర హీరో సందీప్ కిషన్‌ను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 8,9 తేదీల్లో మూడు సినిమాలు వస్తున్నాయి. రవితేజ ఈగిల్, యాత్ర 2తో పాటు సందీప్ కిషన్ ఊరిపేరు భైరవకోన సినిమాలు ఉన్నాయి.
సంక్రాంతి రేసులో ఉన్న ఈగిల్‌కు సోలో డేట్ ఇస్తామని.. ఇండస్ట్రీ పెద్దలు హామీ ఇచ్చారు. అయితే అదే డేట్‌కు భైరవకోన లాక్ అయ్యి ఉందన్న విషయం మర్చిపోయారు. ఈగిల్ సినిమాను మళ్లీ వాయిదా వేయించలేరు. వైఎస్.జగన్ పాదయాత్ర మీద తీసిన యాత్ర 2 ఏపీ సీఎం జగన్ బయోపిక్ కావడంతో దానిని వాయిదా వేయించే సాహసం చేయలేరు. పైగా ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసింది.
దీంతో ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఊరిపేరు భైరవకోన మీద ఒత్తిడి చేస్తున్నారట. ఈ సినిమాను వాయిదా వేసేందుకు నిర్మాత ఒప్పుకోలేదు. దీంతో నిర్మాత అనిల్ సుంకర మీద ఇప్పుడు ఇండస్ట్రీ బిగ్ షాట్స్ ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. వెనక్కు వెళితే వడ్డీలు ఎవరు ? భరిస్తారన్న ప్రశ్న ఉంది. పైగా ఈ సినిమాను హోల్‌సేల్‌గా కొన్నవాళ్లంతా సినిమా వాయిదా వేసేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు సందీప్ కిషన్ టాలీవుడ్ పెద్దలకు టార్గెట్ అయినట్టుగానే ఇండస్ట్రీలో ఒక్కటే చర్చ నడుస్తోంది.