టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – అనుష్క మధ్య వార్తలు ఎప్పుడు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటాయి. వీరిద్దరు ప్రేమలో పడ్డారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వచ్చే వార్తలకు అంతే ఉండదు. తెలుగు మీడియా, తెలుగు సోషల్ మీడియా అయితే వీరిద్దరికి ఇప్పటికే కొన్ని వందల సార్లు పెళ్లి చేసేసి ఉంటుంది. అనుష్క – ప్రభాస్ గురించి ఏ వార్త వచ్చినా కూడా ఎప్పుడూ హాట్ కేకులా ఉంటుంది. తెలుగు సినీ అభిమానులు అందరికి వీరిద్దరి గురించి ఏ వార్త వచ్చినా తెలుసుకునేందుకు అమితాసక్తి ఉంటుంది.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో బిల్లా, బాహుబలి 1, బాహుబలి 2, మిర్చి సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాలు సూపర్ హిట్. ఇంకా చెప్పాలంటే అనుష్క – ప్రభాస్ వెండితెర మీద ఎంత పెద్ద హిట్ కొట్టారో.. వీరి అభిమానులు వీరు నిజ జీవితంలో కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అనుష్క – ప్రభాస్ వయస్సు ఇప్పటికే 40 ఏళ్లు దాటేసింది. ఇంకా వీరు పెళ్లి చేసుకోకపోవడంతో భవిష్యత్తులో వీరు నిజంగానే పెళ్లి చేసుకుంటారని కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు.
పైగా అనుష్క ఇప్పటకీ కూడా ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ బ్యానర్లోనే ఉంటుంది. ఇటీవల చేసిన మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా.. ఇప్పుడు చిరు సినిమా కూడా యూవీ బ్యానర్లోనే చేస్తోంది. వీరిద్దరు ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్. అసలు వీరిద్దరు ఎలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ? వీరి స్నేహం ఫస్ట్ ఎలా చిగురించింది.. ఎక్కడ ఎలా ? ప్రేమలో పడ్డారన్నది కూడా ఆసక్తికరమే.
బిల్లా షూటింగ్ టైంలో దర్శకుడు మెహర్ రమేష్ మలేషియాలో చాలా లెన్దీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడే ఏకంగా 40 రోజులకు పైగా షూట్ జరిగింది. ఆ టైంలోనే ప్రభాస్, అనుష్క మంచి స్నేహితులు అయ్యారు. చాలా యేళ్ల పాటు వీరి స్నేహం కొనసాగింది. మిర్చి సినిమా టైంకు వచ్చే సరికే అనుష్క.. నాగార్జునకు దూరమైంది.. ఆ తర్వాత ప్రభాస్‌కు దగ్గరైందని అంటారు.
బాహుబలి సినిమాల్లో అనుష్కను హీరోయిన్‌గా పెట్టించడానికి ప్రభాస్ కూడా ఓ కారణం అంటారు. ఏదేమైనా వెండితెరపై ఈ జంట ఎంత గొప్పగా కెమిస్ట్రీ పండించిందో నిజ జీవితంలోనూ అంతే గొప్ప ఫెయిర్ అన్న భావన చాలా మందిలో ఉంది. అసలు వీరిద్దరి మనసుల్లో ఏముందో గాని.. వీరి పెళ్లి తెలుగు మీడియాలో ఎప్పుడూ సెన్షేషనే. మరి ఈ విషయంలో వీరు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో ? అప్పటి వరకు ఇది పెద్ద సస్పెన్సే..!