బేబీ సినిమాతో బాగా పాపులర్ అయిన అమ్మాయి వైష్ణవీ చైతన్య. పక్కా హైదరాబాదీ అయిన వైష్ణవీ ఇప్పుడు క్రేజీ హీరోయిన్. కానీ, ఈ అమ్మాయి సక్సెస్ వెనకాల ఎన్నో కష్టాలున్నాయి. చెప్పాలంటే స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సమంత కెరీర్ కూడా ప్రారంభంలో ఇలాగే ఉంది. హీరోయిన్ కాక ముందు సమంత 500 రూపాయల కోసం వెల్కం గర్ల్ గా పనిచేసింది.
ఒక ఈవెంట్ కి అథిదులకి స్వాగతం పలికే అమ్మాయిగా నిలుచుంటే పనయ్యాక 500 రూపాయలు ఇచ్చేవారు. అవి చేతిలోకి తీసుకున్న సమంతకి ఏదో సాధించినట్టుగా ఫిలయ్యేది. అలాంటి సమంత ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంటుందని ఎవరైనా ఊహించారా..? సమంత కూడా అనుకొని ఉండదు.
అలాంటి ఒడిదుడుకులు ఎదుర్కున్న యంగ్ బ్యూటీ వైష్ణవీ చైతన్య. 10వ తరగతిలోనే ఇంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకుంది. అందుకోసం తన వైపు నుంచి ఏం చేయాలో ఆలోచించి ఈవెంట్స్ కి వెళితే మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకూ డాన్స్ చేస్తే 700 రూపాయలు ఇచ్చేవారట. అలా కుటుంబ పోషణ కోసం వైష్ణవీ కష్టపడింది.
ఆ తర్వాత షార్ట్ ఫిలింస్ లో నటించే అవకాశాలు అందుకోవడం..వాటితో బాగా గుర్తింపు తెచ్చుకోవడం దాంతో బేబీ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కడం ఓ కలలా జరిగిపోయాయి. ఇప్పుడు వైష్ణవీ కి హీరోయిన్గా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐటెం సాంగ్స్ చేయమనీ కొందరు మేకర్స్ అడుగుతున్నారు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి స్థాయికి వస్తుంది.