Newsవామ్మో..త్రివిక్రమ్ ఈ సీన్ ను అక్కడి నుండి కాపీ కొట్టాడా..? సేమ్...

వామ్మో..త్రివిక్రమ్ ఈ సీన్ ను అక్కడి నుండి కాపీ కొట్టాడా..? సేమ్ టూ సేమ్ మహేశ్ కి ఇలాగే ముద్దు పెట్టిన స్టార్ హీరోయిన్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా గుంటూరు కారం . ఈ సినిమాలో మీనాక్షి చౌదరి – శ్రీ లీల హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు అదిరిపోయే పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . “ఓ మై బేబీ” అంటూ సాగే రెండో పాటను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు .

ఈనెల 11న సాయంత్రం నాలుగు గంటలకు ఈ పాట ప్రోమోని విడుదల చేస్తామని .. 13న పూర్తి పాటను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్ . ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు .ఈ పోస్టర్ లో శ్రీ లీల హాఫ్ శారీలో ఎంతో క్యూట్ గా ఉంది . అంతేకాదు పక్కనే ఉన్న మహేష్ ని ఘాటుగా ముద్దు పెట్టుకుంటుంది. అయితే ఈ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరికి గతంలో మహేష్ బాబు నటించిన ఓ సినిమా పిక్ గుర్తొస్తుంది .

సేమ్ టు సేమ్ ఇదేవిధంగా మహేష్ బాబును గతంలో హీరోయిన్ సమంత ముద్దు పెట్టుకుంటుంది. దూకుడు సినిమాలో ఇదే సీన్ కనిపిస్తుంది. దీంతో త్రివిక్రమ్ ఆ సీన్ ని దూకుడు నుంచి కాపీ కొట్టాడా ..?అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు మహేష్ బాబు ఎన్నిసార్లు అలా చేసినా చూడాలనిపిస్తుంది అంటూ నాటీ కమెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఒక్క పోస్టర్తోనే సోషల్ మీడియాలో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసుకుంది గుంటూరు కారం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news