ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ప్రతి సినిమాలోని బోల్డ్ సీన్ ఉండాల్సిందే . అయితే బట్టలు విప్పడం లేదంటే డోర్లు వేసుకుని పచ్చి బూతులు వీడియోగా చూపించడం ఇలాంటివే చేస్తున్నారు డైరెక్టర్స్ . మరి కొంతమంది పద్ధతిగా చేస్తున్నామంటూనే బోల్డ్ లిప్ లాక్స్ ఘాటైన హగ్గులను చూపిస్తున్నారు . కాగా హీరోలు కూడా మారుతున్న కాలానికి తమ పద్ధతులను మార్చేసుకుంటున్నారు .
కానీ కోలీవుడ్ స్టార్ హీరో మాత్రం ఓ హీరోయిన్ తో లిప్ లాక్ చేయమంటే ఏకంగా సినిమానే ఆపేస్తాను అంటూ స్ట్రైట్ గా చెప్పేసాడట. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న రోల్స్ లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న విజయ్ సేతుపతి హీరోయిన్ త్రిషతో కలిసి నటించిన సినిమ 96 . ఈ సినిమా కోలీవుడ్ లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది .
అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయగా జాను అనే పేరుతో శర్వానంద్ – సమంత హీరో హీరోయిన్లుగా నటించారు . అయితే 96 సినిమా ఆఖరి సీన్ లో త్రిష విజయ్ సేతుపతి పై లిప్ లాక్ సీన్ రాసుకున్నాడు డైరెక్టర్ . అయితే “చాలా పద్ధతిగా సాగిపోతున్న లవ్ స్టోరీ లో ఇలాంటి సీన్ పెడితే జనాలు యాక్సెప్ట్ చేయారని.. అలాంటి సీన్ నేను చేయను ” అంటూ విజయసేతుపతి ముఖాన్ని చెప్పేశారట . ఆ కారణంగానే త్రిషతో అలాంటి సీన్ మిస్ చేసుకున్నాడు . నిజానికి ఆ ప్లేస్ లో వేరే ఏ హీరో ఉన్నా కూడా మిస్ చేసుకునేవారు కాదు ఆ విషయం మీకు ఆయనకు వాళ్లకు అందరికీ తెలుసు..!!