చెన్నై చిన్నది సమంత ఏ ముహూర్తన టాలీవుడ్ లో నాగచైతన్య.. ఏ మాయ చేసావే సినిమాతో అడుగుపెట్టిందో కానీ ఆప్పటి నుంచి ఆమె పట్టిందల్లా బంగారం అయింది. చివరకు ఆమె కెరీర్ పరంగా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సమంత తమ సినిమాలో ఉంటే చాలు అనుకున్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు. సమంత సినిమాలో ఉంటే చాలు ఆ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ హాట్ కేకులా జరిగేది. ఒకానొక టైంలో సమంత.. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు అటు తమిళంలో సూర్య, విశాల్ ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.
అటు సీనియర్ హీరోలు, స్టార్ హీరోలతో పాటు ఇటు కొత్త హీరోల సినిమాలలో నటించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను అల్లుడు శీను సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం చేశారు. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకోవడం ఒక సెన్సేషన్ గా నిలిచింది.
బెల్లంకొండ వరుసగా ఒకేసారి ఇటు వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను.. అటు ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రభస సినిమాలో నిర్మించారు. ఈ రెండు సినిమాల్లోనూ సమంత హీరోయిన్గా నటించింది. తన బ్యానర్ లో వరుసగా రెండు సినిమాలలో నటించేందుకు గాను సమంతకు రెమ్యూనరేషన్ గా అప్పట్లో రూ.6 కోట్ల విలువైన ఒక పెద్ద విల్లాను సురేష్ ఆమెకు బహుమతిగా ఇచ్చారని అంటారు. సమంత అంటే అప్పుడు క్రేజీ హీరోయిన్.. అప్ కమింగ్ హీరో అయిన శ్రీనివాస్ పక్కన నటించేందుకు ముందు కాస్త తట పటాయించింది.
అయితే బెల్లంకొండ ఇచ్చిన విల్లా ఆఫర్‌తో ఆమె వెంటనే శ్రీనివాస్ పక్కన హీరోయిన్గా నటించేందుకు ఓకే చెప్పిందన్న గుసగుసలు అప్పట్లో వినిపించాయి. ఈ రెండు సినిమాలలో అల్లుడు శీను ఒక మోస్తరుగా ఆడగా, రభస సినిమా మాత్రం డిజాస్టర్ అయి బెల్లంకొండకు భారీ నష్టాలు మిగిల్చింది. ఇటు అల్లుడు శీను సినిమాకు కూడా భారీ కాస్టింగ్ నేపథ్యంలో అనుకున్న లాభాలు రాలేదు.