Newsసుడిగాలి సుధీర్ కి ఊహించని కోలుకోలేని షాక్..పై నుంచి కింది వరకు...

సుడిగాలి సుధీర్ కి ఊహించని కోలుకోలేని షాక్..పై నుంచి కింది వరకు దూల తీరిపోయిందిగా..?

సుడిగాలి సుధీర్ ఓ స్టార్ హీరోకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో క్రేజ్ తో ఇండస్ట్రీలో బుల్లితెరపై దూసుకుపోయిన ఈ కమెడియన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . సోషల్ మీడియాలో ఈయన పేరు చెప్తే ఊగిపోయే జనాలు చాలామంది ఉన్నారు . అంతేకాదు సుధీర్ ను తిడితే మండిపడిపోయే జనాలు మరింత స్థాయిలో ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి క్రేజ్ దక్కించుకున్న సుడిగాలి సుధీర్ .

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కనిపించడమే మానేశారు. హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . అయితే హీరోగా సెటిల్ అవ్వాలన్న కోరికతో ఆయన బుల్లితెరను పూర్తిగా దూరం పెట్టేశాడు. చాలామంది కూడా ఇది తప్పు అంటూ ఆయనపై మండిపడ్డారు. అయితే తాను చేసిన తప్పుకి సుడిగాలి సుధీర్ దూల తీరిపోయింది అంటూ ప్రజెంట్ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన సినిమా “కాలింగ్ సహస్ర” .

డిసెంబరు ఒకటిన ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఆకాశాన్ని తాకే అంచనాలతో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిసిన సుడిగాలి సుదీర్ ధైర్యంగా ఈ సినిమాను రిలీజ్ చేశాడు . అసలు యానిమల్ సినిమా ముందు సుడిగాలి సుధీర్ మూవీ చీమంత. అసలు ఈ సినిమాని జనాలు పట్టించుకోవడమే మానేశారు . కొన్ని థియేటర్స్ ఖాళీగా ఉండిపోయాయి . సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది .

దీంతో సుడిగాలి సుధీర్ర్ సినిమాకు తీవ్ర నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే కొందరు కావాలని సుధీర్ సినిమాను ట్రోల్ చేస్తున్నారు . ఇన్నాళ్లు విర్రవీగిన నీకు దూల తీర్పించేసింది ఈ సినిమా . ఇకనైనా మారు .. లైఫ్ ఇచ్చిన బుల్లితెరను వదలొద్దు అంటూ చెబుతుంటే మరికొందరు సినిమా అన్నాక కామన్ అనిమల్ సినిమా హిట్ అయినంత మాత్రాన ..సుధీర్ సినిమా ఫ్లాప్ అయిందని ఎలా అనగలరు ..అది అదే ఇది ఇదే అంటూ సపోర్ట్ చేస్తున్నారు . కానీ సుడిగాలి సుధీర్ కి మాత్రం ఈ సినిమా పూర్తి నష్టాలు తీసుకొచ్చింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news