యాంకర్ సుమ అందరికీ మంచి సుపరిచితురాలు . చిన్న పెద్ద హ్యాపీగా నవ్వుకునేలా చేస్తుంది. కొన్ని గేమ్ షోస్ తో సినిమా ఇండస్ట్రీలో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ సుమ ప్రెసెంట్ బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా ముందుకెళ్తుంది . రీసెంట్గా యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బబుల్గం సినిమాతో డిసెంబర్ 29న థియేటర్స్ లో గ్రాండ్గా అభిమానులను పలకరించబోతున్నాడు .
సినిమా ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు . తండ్రి రాజీవ్ కనకాల తల్లి సుమ కనకాల తన బిడ్డ రోషన్ కనకాల కెరియర్ కు బాగా సపోర్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోని హైదరాబాద్లో మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు . అయితే నిజానికి సుమ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఓ బడా హీరోని ఇన్వైట్ చేయడానికి ఇంటికి వెళ్తే ఆయన కాల్ షీట్స్ ఫ్రీగా ఉన్నా సరే బిజీగా ఉన్నాయి అంటూ అబద్ధం చెప్పారట .
అంతేకాదు ఆయన సినిమాలకు కచ్చితంగా సుమనే హోస్ట్ చేయాలి అన్ని పట్టుబట్టే ఈ హీరో స్టేజిపై ఎన్నోసార్లు సుమను పొగిడేసారు. ఆమె లేకపోతే ఇండస్ట్రీ వేస్ట్ అన్న విధంగా మాట్లాడిన ఆయన “రోషన్ కనకాలకు హీరో అయ్యే మెటీరియల్ లేదు అని ..ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన నా కారణంగానే సినిమా పోయింది అని చెప్పుకుని ట్రోల్ చేస్తారని.. భయంతో సుమకు అబద్ధం చెప్పి దారుణంగా అవమానించాడట”. అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న సుమ చాలా బాధపడ్డిందట. ” నా గురించి తెలిసి కూడా నాపై ఇలాగా మాట్లాడుకుంటారా..?” అంటూ ఏడ్చేసిందట. ఫైనల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అడవి శేషు – సిద్ధు జొన్నలగడ్డ వచ్చి సుమకు సపోర్ట్ చేశారు..!!