మన టాలీవుడ్ యంగ్‌రెబల్ స్టార్ ఉప్పలపాటి ప్రభాస్ రాజు క్రేజ్ మామూలుగా లేదు. బాహుబలి దెబ్బతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి సీరిస్ సినిమాలు ఆ వెంటనే వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్‌ను మాత్రం తిరుగులేని నేషనల్ స్టార్‌ను చేసేశాయి. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో ఈ నెల 22న పాన్ ఇండియా రేంజ్‌లో థియేటర్లలోకి దిగుతున్నాడు.
సినిమాపై ఉన్న హైప్, బజ్‌తో పోలిస్తే ఆ రేంజ్‌లో ప్రమోషన్లు చేయడం లేదన్న విమర్శలు అయితే ఉన్నాయి. అంత ప్రమోషన్లు చేయకపోయినా కూడా ఈ సినిమాపై హైప్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పేందుకు ప్రి రిలీజ్ బజ్, అడ్వాన్స్ బుకింగ్స్‌లే చెపుతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో సలార్‌ను ప్రత్యంగిరా సినిమాస్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ సలార్ సినిమా ప్రీ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ కాగా సెన్సేషనల్ బుకింగ్స్ నమోదు చేస్తోంది.
ఇప్పటికే అక్కడ హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసిన సలార్… ఇప్పుడు 7 లక్షల డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇంకా సినిమా రిలీజ్‌కు 8 రోజుల టైం ఉంది. అక్కడ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సలార్ ఖాతాలో రు. 4 కోట్లు వచ్చిపడ్డాయి. ఈ ఊపు చూస్తుంటే రిలీజ్ ఫస్ట్ డేకు ముందే 2 – 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లు… అది కూడా తెలుగు వెర్షన్ నుంచే రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా ఇటు ప్రభాస్ క్రేజ్, అటు ప్రశాంత్ నీల్ రేంజ్ దెబ్బతో సలార్ ఊచకోత మొదలైపోయిందనే చెప్పాలి.