Movies"నీది హీరో అయ్యే ముఖమేనా..?"..కళ్యాణ్ రామ్ ని దారుణంగా అవమానించింది ఎవరో...

“నీది హీరో అయ్యే ముఖమేనా..?”..కళ్యాణ్ రామ్ ని దారుణంగా అవమానించింది ఎవరో తెలుసా..?

టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ..తాజాగా నటించిన సినిమా “డెవిల్”. బింబిసారా తరువాత అమిగోస్ మూవితో జనాల ముందుకు వచ్చిన కళ్యాణ్రామ్ కు ఆ మూవీ నిరాశ మిగిల్చింది. ఈ క్రమంలోనే డెవిల్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నాడు కళ్యాణ్ రామ్ . డిసెంబర్ 29న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాను అన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.

ఈ సినిమాలో కళ్యాణ్రామ్ కి జోడిగా సంయుక్త మీనన్ నటిస్తుంది. వీళ్లిద్దరూ కలిసి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమా అడ్డ షోకి హాజరయ్యారు . ఈ షోలో కళ్యాణ్ రామ్ సుమతో చేసిన సందడి అంతా ఇంతా కాదు .సుమకి ధీటుగా కామెడీ చేసి పంచులు వేస్తూ ఆకట్టుకున్నాడు . ఇదే క్రమంలో తన కెరియర్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు . “నేను హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమాలు డిజాస్టర్ గా మారాయి . మొదటి రెండు చిత్రాలు తొలిచూపులోనే , అభిమన్యు తీవ్రంగా నిరాశపరిచాయి ..అప్పట్లో చాలామంది నాముందే నెగటివ్ కామెంట్స్ చేశారు”.

” అసలు నీకు యాక్టింగ్ అవసరమా ..? యాక్టింగ్ స్కిల్స్ లేవు వెళ్ళిపో ..”అంటూ హేళనగా మాట్లాడారు . ఆ టైంలో నాకు సపోర్ట్ గా నిలిచింది మా నాన్నగారు మాత్రమే. మీకు ఏది నచ్చితే అది దేని గురించి ఆలోచించొద్దు ..పక్క వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దు అంటూ నన్ను ప్రోత్సహించారు” అంటూ ఎమోషనల్ గా కామెంట్ చేశారు . ప్రెసెంట్ కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news