టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు ఇటీవల కాలంలో భీష్మ సినిమా తర్వాత సరైన హిట్ లేదు. నితిన్ నటించిన చివరి మూడు సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. చివరి సినిమా మాచర్ల నియోజకవర్గం అయితే ఘోరమైన పరాజయం మూటగట్టుకుంది. తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్‌లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా తెరకెక్కింది. టాలీవుడ్‌ను ఊపేస్తున్న క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
దీనికి తోడు హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించిన డేంజర్ పిల్లాపాటతో పాటు రెండు, మూడు పాటలు ప్రేక్షకులకు బాగా ఎక్కేశాయి. నాని హాయ్ నాన్న సినిమాకు పోటీగా రిలీజైన ఈ సినిమా రూ.50 కోట్ల రేంజ్ బడ్జెట్‌తో తెరకెక్కింది. బాక్సాఫీస్ దగ్గర ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు కేవలం రూ.4.29 కోట్ల షేర్ మాత్రమే దక్కింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఐదు రోజుల్లో కేవలం రూ.4 కోట్ల వచ్చాయి.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.21 కోట్ల షేర్ రాబట్టాలి. ఇప్పటికే ఈ సినిమా ఆడుతున్న చాలా థియేటర్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే నితిన్ తన ఖాతాలో మరో డిజాస్టర్ వేసుకున్నాడని చెప్పాలి. ఒకప్పుడు నితిన్ సినిమాలకు తొలి రోజు రూ.5 నుంచి 6 కోట్ల షేర్ వచ్చేది. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు ఐదు రోజులకు కనీసం రూ.5 కోట్ల షేర్‌కూడా రాలేదు.
దీనిని బట్టి నితిన్‌కు వరుసగా నాలుగో పరాజయం దక్కింది. నితిన్ రేంజ్ ఎలా ? పడిపోయిందో క్లియర్‌గా తెలుస్తోంది. ఇకనుంచి అయినా నితిన్ కథల విషయంలో, దర్శకుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోపోతే గతంలో నితిన్‌కు వరుసగా 13 పరాజయాలు రాగా.. ఇప్పుడు ఆ రికార్డును మరోసారి తానే బ్రేక్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.