చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు, ఎన్నో క్లాస్ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు కాంట్రవర్సీలో కూడా చిక్కుకున్నాయి. అలా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన అల్లుడా మజాకా సినిమా కూడా పెద్ద కాంట్రవర్సీలో చెక్కుకుంది. 1995లో రిలీజ్ అయిన ఈ సినిమాను దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె దేవి వరప్రసాద్ నిర్మించారు. చిరంజీవి, రమ్యకృష్ణ, రంభ, ఊహ ముఖ్య పాత్రలలో నటించారు.
పోసాని కృష్ణ మురళి ఈ సినిమాకు చిత్రానువాదం సమకూర్చారు. ఈ సినిమాను కిలాడి పేరుతో కనడంలో రీమేక్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇందులో మహిళలను అభ్యంతరకరంగా చూపించారంటూ కమ్యూనిస్టులు, హిందూ జాతీయ వాదులు, ఈ సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమించారు. సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత సెన్సార్ బోర్డ్ ఈ సినిమాను నిషేధించింది. దీనిపై చిరంజీవి అభిమాన సంఘాలు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ధర్నా చేశాయి.
దీంతో వారు నిషేధాన్ని వెనక్కి తీసుకుని సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తీసివేసి సినిమాను ప్రదర్శించవచ్చు అని అనుమతించారు. అలా అల్లుడా మజాకా సినిమా రిలీజ్ అయ్యాక రెండు నెలల తర్వాత ఇంత పెద్ద కాంట్రవర్సీకి గురైంది. అప్పట్లో మహిళా సంఘాలు కూడా ఈ సినిమాను టార్గెట్‌గా చేసుకొని ధర్నాలకు, నిరసనలకు దిగటం ఒక సంచలనం అయింది.