సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి పనిచేశారు. విడిపోక ముందు ఇద్దరు ఒక సినిమా ఒప్పుకుంటే ట్యూన్స్ దగ్గరనుంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వరకూ కలిసే వర్క్ చేసేవారు. మ్యూజికల్ హిట్ గ్యారెంటీ అని దర్శక నిర్మాతలే కాదు, హీరోలు కూడా గట్టిగా నమ్మేవారు. ఇద్దరు మంచి ఉన్నత కుటుంబం నుంచీ వచ్చారు. వారి పేరులోని పదాలనే కలిసి పెట్టుకున్నారు.
రాజ్ – కోటి కలిసి సంగీతం అందించిన మొదటి సినిమా ప్రళయ గర్జన. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి మ్యూజిక్ అందించారు. చిరంజీవి హీరోగా నటించిన యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి అప్పట్లో మంచి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అలాగే, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి సినిమాలకు ఈ సంగీత దర్శక ద్వయం సంగీతాన్ని సమకూర్చారు.
అయితే, ఇద్దరి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల రాజ్-కోటి విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాజ్ సంగీతం అందించిన సినిమాలు చాలా తక్కువ. రాజ్ ఒక్కడే సంగీతం అందించిన సినిమా “సిసింద్రీ”. మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశాలు తగ్గాక కొన్ని టీవి షో లకు జడ్‌గా వ్యవహరించారు. ఇక కోటి మాత్రం ఇప్పటికీ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.
హలో బ్రదర్ తర్వాత మళ్ళీ కోటి ఫాంలోకి వచ్చిన సినిమా నువ్వే కావాలి. ఈ సినిమాలోని సాంగ్స్ బ్లాస్ట్ అయ్యాయి. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఇక లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అరుంధతి సినిమా కోటి కెరీర్‌లో గొప్పగా చెప్పుకోవాలి. ప్రస్తుతం కోటి కూడా సినిమాలకంటే టీవీ షోలలో ఎక్కువగా కనిపిస్తున్నారు.