వేణు తొట్టేంపూడి..స్వయంవరం సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇదే సినిమాతో లయ హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. స్వయంవరం కంటే ముందే వేణు భారతీరాజా దర్శకత్వంలో హీరోగా నటించే అవకాశం అందుకున్నాడు. కానీ, అనుకోని కారణాల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో వేణు స్నేహితుడు వెంకట శ్యాం ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా స్వయంవరం నిర్మించారు.
ఈ సినిమాతో వేణు బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డ్ అందుకున్నారు. అప్పటి నుంచి సొంత సంస్థలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చారు. చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, గోపి గోపిక గోదావరి తీరం లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి బాగా పాపులర్ అయ్యాడు. కానీ, టాలీవుడ్ లో స్టార్ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు వేణు.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూడు నాలుగు సినిమాలు చేశాడు. అవి అంతగా కలిసి రాలేదు. దాంతో చాలా ఏళ్ళు గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇంత కాలానికి రవితేజ నటించిన రామారావు ఆన్‌డ్యూటీ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే వెబ్ సిరీస్ లోనూ నటించాడు. కానీ, ఆశించినంతగా మాత్రం వేణుకి ఇప్పటి హీరోల సినిమాలలో ఛాన్సులు రావడం లేదు.
అయితే, ఒకేసారి కెరీర్ మొదలుపెట్టిన వేణు, త్రివిక్రమ్ లలో వేణు అలాగే ఉండిపోయాడు. త్రివిక్రమ్ మాత్రం స్టార్ డైరెక్టర్ గా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎవరి వల్ల ఎవరు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు అంటే దానికి సమాధానం చెప్పడం కష్టమే. ఇక్కడ ఎవరికీ ఎవరు లైఫ్ ఇవ్వలేదు. టాలెంట్ వల్లే ఒకరు దర్శకరచయితగా నిలబడితే లక్ లేక వేణు ఫేడవుట్ అయ్యాడు. మరి త్రివిక్రమ్ మళ్ళీ తను తీసున్న సినిమాలలో మంచి క్యారెక్టర్ ఇచ్చి ఫాంలోకి తెస్తాడో లేదో..!