సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడం.. భూతద్దంలో పెట్టి చూడడం కామన్ గా మారిపోయింది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాల గురించి అయితే ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు జనాలు. ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి సురేఖ రెండో భార్య అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.
అంతేకాదు మెగాస్టార్ మొదటి భార్యని కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు . జనరల్ గా ఎవరికైనా సరే వర్క్ ప్రిఫరెన్స్ ముందుంటుంది . ఆ తర్వాతే కుటుంబం, ఫ్యామిలీ అంతా . మన మెగాస్టార్ కి అంతే.. సినిమాలే ప్రపంచం సినిమాల కోసం ఏమైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు . పెళ్లి తర్వాత కూడా చిరంజీవి సినిమాల కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలిసిందే.
అయితే చిరంజీవి పెళ్లి తర్వాత తన భార్యను పట్టించుకోకుండా సినిమాలు అంటూ బాగా తిరిగేసేవాడట . కనీసం కొత్తగా పెళ్లయింది.. ఆ అమ్మాయి ఒక్కటే ఇంట్లో ఉంటుంది అని కూడా ఆలోచించకుండా ఎంతసేపు షూటింగ్లు అంటూ తిరిగేవాడట . ఈ క్రమంలోనే అందరూ అప్పట్లో చిరంజీవికి మొదటి భార్య సినిమాలు అని.. రెండో భార్య సురేఖ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. ఒకానొక సందర్భంలో సురేఖ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ” నాకంటే ఆ సినిమాలే ఆయనకు ఇంపార్టెంట్” అంటూ సరదాగా నవ్వేసింది. దీంతో ఇదే విషయాన్ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు..!!