సుమ – రాజీవ్ కనకాల ఈ పేర్లు తెలియని తెలుగు ప్రజలు, తెలుగు కుటుంబాలు ఉండవు. ఇద్దరిదీ నటన రంగమే. సుమ మలయాళి. రాజీవ్ కనకాల తల్లిదండ్రులు దేవదాసు కనకాల, లక్ష్మీ కనకాల ఇద్దరు నటనలో ఒక స్థాయి చూసినవాళ్లు. యాక్టింగ్ స్కూల్ కూడా నడిపారు. మలయాళ ముద్దుగుమ్మ సమతో రాజీవ్ ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. సుమా కెరీర్ ప్రారంభంలో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. ఆమెకి సూట్ అవ్వలేదు. ఆ తర్వాత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగులో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే ఈ కుటుంబం నుంచి మూడోతరం వారసుడిగా సుమ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ తాజాగా బబుల్‌గమ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.
సుమ కొడుకు అని ఎన్నో ఆశలతో, ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు జుట్టు పీక్కున్నంత పని అయింది. ఇది విలువలు ఏమాత్రం లేని ఫక్తు అర్బన్ జంక్ సినిమా. డైలాగుల్లో నీ జాబు ని.. లో పెట్టుకో ఇలాంటి రాయడానికే అసహ్యమైన పదాలు చాలా ఉన్నాయి. కూతురిని స్వయంగా తండ్రి ఓ అబ్బాయి తో డేటింగ్ చేసి నచ్చుతాడో లేదో చెక్ చేసుకోమని సలహా ఇస్తాడు. మనం టాయ్స్‌తో ఆడుకోవాలి. టాయ్స్ అవకూడదు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ హీరోయిన్ చెబుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే విలువలు లేని సోకాల్డ్ యూత్ ఫుల్ సినిమా. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు.. ఏదో తెలిసి తెలియక ఇలాంటి సినిమా ట్రై చేశారు అంటే అనుకోవచ్చు.
కానీ ఇన్నేళ్లు సినిమా రంగంలో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్న సుమ అయినా ఇలాంటి సినిమాతో తన కొడుకుని లాంచ్ చేస్తుందంటే చాలా బాధాకరం. ఇక రోషన్ కనకాల అద్భుతంగా ఏదో చేసేసాడు.. అని చెప్పటానికి లేదు. విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డని చూసేశాక అదే స్టైల్ కాఫీ కొట్టినట్టుగా అనిపించింది. ఫైనల్‌గా సుమకు బాధ అనిపించిన ఒకటి మాత్రం నిజం. రోషన్ కలర్ వదిలేస్తే తను హీరో మెటీరియల్ కాదు. తన లుక్ కూడా పెద్దగా ఇంప్రెస్సివ్ కాదు. మన హీరోలలో చాలామందితో పోలిస్తే బెటర్. అది మాత్రం నిజం. నాలుగు మంచి పాత్రలు పడితే క్లిక్ అవుతాడు. కాకపోతే ఆ పాత్రలు వచ్చేలా చేయటం సుమ మీద ఉన్న బాధ్యత. అంతేకానీ ఇలాంటి బూతు సినిమాలు వదిలేస్తే బెటర్.