ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం వింటూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆమె పేరు మాత్రం హై రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . ఆమె నటించిన పలు సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆమె పేరు మాత్రం బాగానే పబ్లిసిటీ దక్కించుకుంటూ వచ్చింది . అయితే ఈ మధ్యకాలంలో శ్రీలీల నటించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
స్కంద తర్వాత రిలీజ్ అయిన భగవంత్ కేసరి హిట్ అయిన ఆ తర్వాత రిలీజ్ అయిన ఆది కేశవ, ఆ తర్వాత రిలీజ్ అయిన ఎక్స్ట్రార్డినరీ మెన్ మొత్తంగా బోల్తా కొట్టాయి. అయితే ఇలా బ్యాక్ టు బ్యాక్ మూడు నెలల వ్యవధిలోనే మూడు డిజాస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకుని మేకర్స్ కు సుమారు 100 కోట్లకు పైగా నష్టాన్ని తీసుకొచ్చింది శ్రీ లీల . ఇప్పటివరకు ఏ హీరోయిన్ కెరియర్లో ఇంత పరమ చెత్త రికార్డు లేదు .
దీంతో అలాంటి పనికిమాలిన పరమ చెత్త రికార్డును సొంతం చేసుకున్న హీరోయిన్గా శ్రీ లీల రికార్డులను నెలకొల్పింది. దీంతో శ్రీలీల ఫ్యాన్స్ కూడా డీలా పడిపోతున్నారు. ఇలాగే ముందుకెళ్తే శ్రీలీల భవిష్యత్తు ఏంటో అంటూ టెన్షన్ పడుతున్నారు. చూడాలి మరి ఇలాంటి పరమ చెత్త బ్రేక్స్ నుంచి గుంటూరు కారం ఆమెకు ఎలాంటి హిట్ ఇస్తుందో..?