సాధారణంగా సినిమాల్లో ఒక్క ఛాన్స్ అంటూ.. నటులు ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు ఇంకా.. తమ నటనను చాటుకునేందుకు అనేక మాధ్యమాలు వచ్చాయి. ముందుగా యూట్యూబ్‌లో ప్రయత్నాలు చేస్తున్నారు. వీటికి వచ్చిన లైకులను బట్టి.. రియాల్టీ షోలలో తమ టాలెంట్‌ను చూపిస్తూ.. వెండి తెరవరకు నటులు సునాయాసంగా ప్రయాణాలు చేస్తున్నారు. అయితే.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మాత్రం ఇవేవీ లేదు.
అప్పట్లో సినిమాల్లో అవకాశం దక్కించుకోవాలంటే.. అనేక రూపాల్లో దర్శకులను, నిర్మాణ సంస్థలను కూడా మచ్చిక చేసుకోవాల్సివచ్చేది. మధ్యలో సిఫారసులు పనిచేసేవి కూడా కాదు. ఇక, కుటుంబ నేపథ్యాలు అసలే ఉండేవి కాదు. పైగా.. కుటుంబాల నుంచి తారలను పరిచయం చేయడం అనేది పెద్ద ఇన్సల్ట్‌గా కూడా ఫీలయ్యేవారు. అందుకే.. అగ్రతారల వారసులు కానీ.. వారి కుటుంబాలకు చెందిన వారు కానీ.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కనిపించలేదు.
ఇలా.. ఒక్క ఛాన్స్ అంటూ.. తెరమీద అవకాశం దక్కించుకున్న నటీమణి.. రాజమండ్రికి చెందిన అంజలీదేవి. ఇదివాస్తవం. చాలా మందికి తెలియదు. అప్పటి దర్శకుడు.. నటుడు.. చిత్తూరు వీ. నాగయ్య.. ఆమెకు తొలి పాత్ర ఇచ్చారు. అప్పటి సంసారం సినిమాలో యువతిగా అంజలీదేవి నటించారు. ఇక, ఆ తర్వాత.. ఆమెకు వరుస పెట్టి సినిమాలువచ్చాయి. ఎంతగా అంటే.. మళ్లీ రాజమండ్రి మొహం చూడలేనంతగా!
ఏకంగా పదేళ్ల తర్వాత.. కానీ, అంజలీదేవి రాజమండ్రికి రాలేకపోయారంటే.. ఆశ్చర్యం వేస్తుంది. అంత బిజీ అయిపోయారు. ఇక, ఆమె సంగీత దర్శకుడు ఆదినారాయణరావును వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత.. సొంత బ్యానర్ అంజలీ పిక్చర్స్‌ను పెట్టుకుని అనేక సినిమాలు తీశారు. దాదాపు అన్ని సినిమాలు కూడా.. సూపర్ హిట్టయ్యాయి. శ్రీలక్ష్మికి తొలి అవకాశం ఇచ్చింది.. దర్శకుడు దాసరి నారాయణరావును ప్రోత్సహించింది కూడా అంజలీదేవే కావడం గమనార్హం.